ఆఖరికి రూమ్ షేర్‌ చేసుకుంటే వాళ్ళు కూడా.. రోజూ ఏడ్చేసేదాన్ని.. 'బాహుబలి' భామ షాకింగ్ కామెంట్స్

Recommended Video

Nora Fatehi Shares Her Personal Experiences In a Recent Interview || Filmibeat Telugu

నోరా ఫతెహి.. ఈ పేరు చెబితే గుర్తు పట్టడం కాస్త కష్టమే గానీ, బాహుబలి సినిమాలో మనోహరి సాంగ్‌తో మెలికలు తిప్పిన బ్యూటీ అంటే అందరికీ స్ట్రైక్ అవుతుంది. బాలీవుడ్, టాలీవుడ్ లోని పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ ద్వారా పాపులారిటీ తెచ్చుకుంది నోరా ఫతెహి. కెనడాకు చెందిన ఈ భామ ఇండియాలో తన కెరీర్ కష్టాలను గురించి తెలుపుతూ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ వివరాలు చూద్దామా..

కెరీర్ ప్రారంభంలోనే చేదు అనుభవాలు

కెరీర్ ప్రారంభంలోనే చేదు అనుభవాలు

కెరీర్ ప్రారంభంలోనే కొందరు తెలియని వారు తనను మోసం చేశారని అంటోంది నోరా ఫతేహి. విదేశాల నుంచి వస్తాం కాబట్టి తెలియని వారితో పరిచయాలు ఏర్పరచుకోవాల్సి వస్తుంది. ఇదే అదనుగా కొందరు మోసాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి అనుభవం తనకు ఎదురైందని చెప్పుకొచ్చింది. కెనడా నుంచి భారత్ వచ్చిన కొత్తలోనే తనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది.

20 లక్షలు తీసుకొని.. చివరకు

20 లక్షలు తీసుకొని.. చివరకు

తనను ఓ ఏజెన్సీ వారు కెనడా నుంచి ఇండియా తీసుకొచ్చారని, అయితే సదరు ఏజెన్సీ ప్రవర్తన తనకు నచ్చకపోవడంతో ఆ ఏజెన్సీ వ్యవహారాల నుంచి దూరంగా ఉండాల్సి వచ్చిందని నోరా పేర్కొంది. ఈ మేరకు ఏజెన్సీకి చెల్లించిన 20 లక్షలు పోగొట్టుకోవాల్సి వచ్చిందని చెప్పింది. తాను ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్మును ఇవ్వముపో అని ఏజెన్సీ వాళ్ళు అనడంతో చాలా బాధేసిందని తెలిపింది.

కొందరితో రూమ్ షేర్‌.. వాళ్ళు కూడా

కొందరితో రూమ్ షేర్‌.. వాళ్ళు కూడా

ఎలాగోలా ఆ ఏజెన్సీ నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత కెరీర్ కొనసాగిస్తూ కొందరితో రూమ్ షేర్‌ చేసుకోవాల్సి వచ్చిందని, అక్కడ కూడా కొన్ని సంఘటనలు తనకు షాకిచ్చాయని పేర్కొంది. తనతో కలిసి ఎనిమిది మంది అమ్మాయిలు రూమ్ లో ఉండేవారని, వాళ్లంతా కలిసి తన పాస్‌పోర్ట్‌ దొంగలించి బాధపెట్టారని అంటోంది నోరా. ఈ సంఘటనలతో కుమిలిపోయే దాన్నని చెప్పింది.

చేసేదిలేక ప్రతీ రోజు ఏడుపే..

చేసేదిలేక ప్రతీ రోజు ఏడుపే..

ఇక ఆడిషన్స్‌ విషయంలో అయితే తానూ డిస్టర్బ్‌ అయినట్లుగా పేర్కొంది నోరా. తాను ఆడియన్స్‌కి వెళ్లి ఆడిషన్ ఇస్తుంటే ఏదో సర్కస్‌ చేస్తున్నట్లు నా ముఖం చూసి అందరూ నవ్వేవారని, వాళ్ళను చూస్తే చాలా అసహ్యంగా అనిపించేదని చెప్పుకొచ్చింది నోరా. చేసేదిలేక ప్రతీ రోజు ఆడిషన్స్‌ నుంచి ఇంటికి వెళ్తూ ఏడ్చేదాన్నని, ఇలా తన జీవితంలో చాలా పరాభవాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెబుతూ ఆవేదన చెందింది ఈ బాహుబలి భామ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X