Top 5 Heroines: కుర్రకారు మనసు దోచిన మలయాళ బ్యూటీలు వీళ్లే.. టూలో మమితా, వన్‌లో ఎవరంటే?
ప్రతీ వారం, నెల ఎంతో మంది హీరోయిన్లు సినీ రంగంలోకి అడుగు పెడుతుంటారు. ముఖ్యంగా చాలా మంది కొత్త కొత్త వాళ్లు వస్తూ... సినీ రంగంలో టాప్ హీరోయిన్లుగా కొనసాగుతారు. ఒక్క బాషలోనే కాకుండా అనేక భాషల్లో నటిస్తూ అందరికీ ఫేవరెట్ గా నిలిచిపోతుంటారు. ముఖ్యంగా యువత హాట్ ఫేవరెట్లుగా మారుతూ అందరినీ మెస్మరైజ్ చేసే వాళ్లలో మలయాళ హీరోయిన్లు మొదటి స్థానంలో ఉన్నారు. అయితే మలయాళ హీరోయిన్లలో టాప్ 5లో ఎవరెవరు ఉన్నారు అనే లిస్టును ఆర్మాక్స్ సంస్థ విడుదల చేసింది. అయితే ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్మాక్స్ మీడియా సంస్థ 2024 మార్చి నెల మలయాళ టాప్ 5 హీరోయిన్లలో మొదటి స్థానంలో మంజు వారియర్ నిలిచింది. 1995లో సాక్ష్యం సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిందీ మంజు వారియర్. అద్భుతమైన అందం, అంతకు మించిన అభినయంతో అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ఎవరూ ఊహించని స్థాయిలో హిట్లు కొట్టింది. 1999లో చివరగా సినిమా చేసిన ఆమె ఆ తర్వాత సినిమాలకు దూరం అయిపోయింది. ఆ తర్వాత 2014లో రీఎంట్రీ ఇచ్చి మరిన్ని హిట్టు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం దేశం మెచ్చిన మలయాళ హీరోయిన్లలో టాప్ 1 స్థానాన్ని దక్కించుకుంది.

ఇక టాప్ 2లో మమితా బైజు నిలిచింది. 2017లోనే ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత కూడా చాలానే సినిమాలు చేసింది. ముఖ్యంగా ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ప్రేమలు అనే సినిమా చేసి విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. అలా ట్రెండింగ్ లో నిలిచిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ట్రెండింగ్ లో నిలుస్తోంది.

ఇకా టాప్3లో ఐశ్వర్య లక్ష్మి నిలిచింది. 32 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ జందుకలుండే నత్తిన ఒరిదవేల్ అనే సినిమాతో 2017లో సినీ రంగంలో అడుగు పెట్టింది. ఇక అప్పటి నుంచి సంవత్సరానికి నాలుగైదు చిత్రాలు చేస్తూ దూసుకళ్తోంది. 2022లో అయితే మొత్తం 8 చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇలా వరుస చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దుమ్మలేపుతున్న ఈమె మూడో స్థానంలో నిలిచింది.

ఇక టాప్ 4లో శోభన నిలిచింది. ప్రస్తుతం 53 ఏళ్ల వయసు కల్గిన శోభన నాగార్జున మొదటి సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. విక్రమ్ అనే సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన ఆమె అనేక చిత్రాల్లో కనిపించింది. ఎవరూ ఊహించని స్థాయిలో హిట్లు కొడుతూ.. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. 1997లో సినిమా చేసిన ఆమె, 2006లో గేమ్ సినిమా చేసింది. ఇక ఆ తర్వాత అంటే 2021లో మరో సినిమాలో కనిపించి మెప్పించింది. కుర్రకారు హాట్ ఫేవరెట్ గా మారిన ఈమె టాప్ 4లో నిలిచింది.
ఇక టాప్ 5లో కల్యాణి ప్రియదర్శన్ నిలిచింది. ప్రస్తుతం 30 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ 2017లో వచ్చిన హలో సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆ తర్వాత తమిళ్ తో పాటు మలయాళ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. 2022లో బ్రో డాడీ అనే సినిమాలో చేసిన ఈమె 2023లో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ యువత మెచ్చిన మలయాళ హీరోయిన్లలో టాప్ 5 హీరోయిన్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications











