పొట్టి నిక్కరు వేసినా... ఫలించని రకుల్ ప్రీత్ సింగ్ సెంటిమెంట్
ఇండియాను ఇపుడు క్రికెట్ ఫీవర్లో పట్టుకుంది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నమెంటులో ఈ సారి టీమిండియా కచ్చితంగా విజేతగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానంలో కొనసాగుతున్న నేపథ్యంలో వారిలో ఉత్సాహం ఉరకలేస్తోంది.
ఇండియా మ్యాచ్ ఆడే సమయంలో అభిమానులు రకరకాల సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. ఇలా చేస్తే తమ అభిమాన జట్టుకు విజయం చేకూరుతుందని వారి నమ్మకం. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సైతం ఇలాంటి సెంటిమెంట్లు పాటిస్తున్నారు.

టీమిండియా కోసం పొట్టి నిక్కరు వేసిన రకుల్
ఆదివారం జరిగిన ఇండియా, ఇంగ్లండ్ మ్యాచ్ రకుల్ ప్రీత్ సింగ్ వైట్ టాప్, డెనిమ్ షార్ట్ వేసుకుని వీక్షించిందట. వరల్డ్ కప్ టోర్నమెంట్ మొదలైనప్పటి నుంచి తాను ఇదే డ్రెస్ వేసుకుని మ్యాచ్ చూస్తున్నానని, ఆదివారం ఇండియా-ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా కూడా ఈ సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్లు ప్రకటించారు.

రకుల్ సెంటిమెంట్ టీమిండియాను కాపాడలేక పోయింది
రకుల్ ప్రీత్ పొట్టి నిక్కరు సెంటిమెంట్ మొదట్లో మ్యాచ్ నుంచి బాగానే వర్కౌట్ అయింది కానీ... ఆదివారం జరిగిన ఇంగ్లండ్ మ్యాచ్ విషయంలో కాలేదు. 31 పరుగుల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 337 పరుగులు చేయగా... భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మ్యాచ్ ముగిసే సమయానికి 5 వికెట్లు నష్టపోయి కేవలం 306 పరులు మాత్రమే చేసింది.

నెక్ట్స్ టైం ఎలాంటి డ్రెస్సు వేస్తుందో?
రకుల్ చేసిన పోస్టుపై నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నెక్ట్స్ టైమ్ ఇండియా మ్యాచ్ సమయంలో రకుల్ తన డ్రెస్సు సెంటిమెంటు మార్చే అవకాశం ఉందని, ఈ సారి డ్రెస్సు సైజు పెంచుతుందో? మరింత తగ్గిస్తుందో? అంటూ ఫన్నీ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

అల్లాడిస్తున్న షెర్లిన్ చోప్రా
రకుల్ సంగతి ఇలా ఉంటే... బాలీవుడ్ బ్యూటీ షెర్లిన్ చోప్రా టీమిండియా మ్యాచెస్ సందర్భంగా తన అందాల ఆరబోతతో క్రికెట్ అభిమానులను కవ్విస్తోంది. బికినీలో బంతాట ఆడుతూ నెటిజన్లకు వినోదం పంచుతూ టీమిండియాకు చీర్స్ చెబుతోంది. షెర్లిన్ చోప్రా వ్యవహారం ఇంటర్నెట్లో సంచలనంగా మారింది.


Click it and Unblock the Notifications











