రాత్రైతే చాలు.. సిల్క్ స్మిత బెడ్‌పై అలా .. సీక్రెట్ చెప్పిన డిస్కో శాంతి

దక్షిణాది నటిగా, డ్యాన్సర్ గా సిల్క్ ఎంత పాపులర్ అయ్యింది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న వయస్సులోనే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. 16 ఏళ్ల వయస్సుల్లోనే చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి హీరోయిన్ గా, నటిగా, డ్యాన్సర్ గా తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటినీ దక్కించుకుంది. తన నటన, ముఖ్యంగా ఆటాపాటతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆమె ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో నిలదొక్కుని తారాస్థాయికి చేరుకోవడం ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మరోవైపు తన ఆత్మహత్య కూడా అభిమానులు, సినీ ప్రముఖులకు ఎంతగానో బాధను కలిగింది. అయితే స్కిల్ స్మిత గురించి తాజాగా మరో సెన్సేషనల్ డ్యాన్సర్, సీనియర్ నటి డిస్కో శాంతి ఒక రహస్యాన్ని చెప్పుకొచ్చారు. స్కిల్ స్మితా తనతో అన్నీ చెప్పుకునేదని తాజా ఇంటర్వ్యూలో వివరించే ప్రయత్నం చేసింది.

స్కిల్ స్మితా డేరింగ్..
ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాకు చెందిన కొవ్వలిలో 1960 డిసెంబర్ 2న జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు. అయితే పెద్దగా చదువుకోలేక పోయింది. కేవలం 4వ తరగతి చదివి మానేసింది. ఆ తర్వాత చిన్నతనంలోనే తనకు పెళ్లి చేశారు. అది కూడా తమ ఆర్థిక పరిస్థితులు తీర్చుకోవడానికి తనని ఒక ముసలి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. అలా చిన్నతనంలోనే స్కిల్ స్మితా ఎన్నో కష్టాలను దాటింది.

Indian Popular Dancer and Actress Silk Smitha Sleeping Secret

ఆతర్వాత డివోర్స్ తీసుకొని చెన్నైకి వెళ్లింది. అక్కడ మేకప్ ఆర్టిస్ట్ గా చేరింది. అలనాటి నటి అపర్ణకు పర్సనల్ మేకప్ ఆరిస్ట్ గా పనిచేసింది. అప్పటి వరకు అడుగడునా స్కిల్ స్మితా అవమానాలు, కష్టాలను ఎదుర్కుంటూనే వచ్చింది. ఇక ఆ తర్వాత నుంచి తమిళం, మలయాళంలో సినిమా అవకాశాలను అందుకోవడం ప్రారంభించింది. 300కు పైగా సినిమాల్లో నటించింది. అందులో 200కు పైగా తమిళ చిత్రాలు కావడం విశేషం. ఇక 35 ఏళ్లకే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.

స్కిల్ స్మితా గురించి సీక్రెట్ చెప్పిన డిస్కో శాంతి..
పాపులర్ నటి స్కిల్ స్మితా డ్యాన్సర్ గా, బోల్డ్ సీన్లలో మెరిసి బాగా పాపులర్ అయ్యింది. దాంతో ఆమె చిత్రాలకు అప్పట్లో ప్రత్యేకమైన మార్కెట్ కూడా ఉండేది. సిల్క్ స్మితా నటకు ఆడియెన్స్ నుంచి కూడా యమా రెస్పాన్స్ వచ్చేది. దీంతో ఆమెకు ఒక దశలో స్టార్ స్టేటస్ ను కూడా అనుభవించింది. ఆ సమయంలో స్కిల్ స్మితా ఒక్క రోజుకే 1 లక్ష రూపాయాల పారితోషికం తీసుకునేదంట.80, 90లలో ఆ స్థాయిలో ఛార్జ్ చేసిందంటే రికార్డ్ రెమ్యునరేషన్ అని అర్థం. అయినా దర్శక నిర్మాతలకు ఆమెకు అవకాశాలు ఇచ్చేవారంట. రీసెంట్ గా ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న పాపులర్ డ్యాన్సర్, సీనియర్ నటి డిస్కో శాంతి ఈ విషయాలను చెప్పుకొచ్చారు.

రాత్రైతే బెడ్ పై అలా..
ఈ క్రమంలో స్కిల్ స్మితా గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది. తనకు చిన్నతనంలోనే అత్యధిక డబ్బు వచ్చిందని స్కిల్ స్మితా గురించి చెప్పింది. అయితే స్కిల్ స్మితా తను సంపాదించిన డబ్బును రాత్రిపూట బెడ్ పై పరిచి కరెన్సీ నోట్లపై పడుకునేదంట. ఈ విషయాన్ని సిల్క్ స్మితానే స్వయంగా డిస్కో శాంతితో చెప్పారని తాజా ఇంటర్వ్యూలో చెప్పడం ఆసక్తికరంగా మారింది. అంతే ఏ రేంజ్ లో సిల్క్ స్మితా సంపాదించిందో అర్థం చేసుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X