అన్నింటిని భరిస్తేనే.. అలాంటి డ్రెస్సింగ్.. బయట ప్రపంచం అంతే..
Indraja: దక్షిణాది సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఇంద్రజ ఒకరూ. తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో వరుస హిట్ సినిమాలతో బిజీ హీరోయిన్‌గా వెలుగొందిన ఆమె, కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌కి ప్రాధాన్యత ఇచ్చింది. ఆ తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఇంద్రజ, ఇప్పుడు బుల్లితెరపై రెండో ఇన్నింగ్స్‌లో మళ్లీ ప్రేక్షకుల ముందు నిలిచి అదే ఆదరణను అందుకుంటోంది. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆనాటి హీరోయిన్ యువత డ్రెస్సింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏమన్నారంటే..?
1990లలో కథానాయిక ఇంద్రజ .. సినిమాల్లో పీక్ స్టేజ్ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని,బుల్లితెరపై జబర్దస్త్ ద్వారా జడ్జిగా బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చింది. తన హుందాతనం, సింప్లీసిటీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ షో పుణ్యమా అంటూ ఆమె 'ఇంద్రజమ్మ'గా మారి, పర్మినెంట్ జడ్జిగా మారిపోయారు. తర్వాత 'శ్రీదేవి డ్రామా కంపెనీ' వంటి షోల్లోనూ జడ్జిగా కొనసాగుతూ, కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ మళ్లీ బిజీ అయ్యింది. ఒకప్పుడు హీరోయిన్‌గా స్టార్‌డమ్ చూసిన ఇంద్రజ, ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఆ ఇమేజ్‌ని నిలబెట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

ఇటీవల హీరోయిన్ ఇంద్రజ.. యాంకర్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్న కిసిక్ టాక్ షోలో పాల్గొంది. యువత ప్రేమ వ్యవహారాలు, డ్రెస్సింగ్ సెన్స్ గురించి చాలా ఓపెన్‌గా తన అభిప్రాయాలను బయటపెట్టారు. ముందుగా ఇండస్ట్రీ అనుభవాలు, కెరీర్ జర్నీ గురించి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో, పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లలో కనిపించే కొన్ని ట్రెండ్స్, అవుట్‌ఫిట్స్‌పై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 'ఇష్టం..నాకు నచ్చినట్టే డ్రెస్సింగ్ వేసుకుంటా.. నువ్వెవరు అడగడానికి? అని చాలామంది అంటున్నారు. కానీ మీరు పబ్లిక్ ఫోరంలోకి వచ్చిన తర్వాత అభ్యంతరకరంగా ఉన్న కాస్ట్యూమ్ ఉంటే, ఎదుటివారు కూడా కామెంట్ చేసే హక్కు ఉంటుంది'అని స్పష్టం చేసింది.
తన వ్యాఖ్యలలో పబ్లిక్ డొమైన్, ప్రైవేట్ స్పేస్ అనే భేదాన్ని స్పష్టంగా వివరించింది. ఇంట్లో ఎలా ఉన్నా, ఫ్రెండ్స్ వద్ద ఎలా ఉన్నా, పబ్లిక్‌లోకిరాగానే ఒక పద్ధతి, మర్యాద, డ్రెస్సింగ్ గైడ్‌లైన్ ఉండాలని వ్యాఖ్యానించింది.'ఇంట్లో మాట్లాడిన స్టైల్ బయట పనిచేయదు. అలాగే డ్రెస్సింగ్ కూడా ఇంట్లోలాగా బయట ఉండకూడదు'అని చెప్పింది. 'ఇది నా ఇష్టం.. నా బాడీ.. నా డ్రెస్సింగ్ అన్నంతవరకు ఓకే. కానీ కామెంట్ చేసినప్పుడు 'ఎందుకు కామెంట్ చేస్తున్నారు?' అని అడగడానికి హక్కు ఉండదు. అభిప్రాయాలు ఎల్లప్పుడూ భిన్నంగా ఉంటాయి. ఒకరి అభిప్రాయం నచ్చకపోవచ్చు.కానీ,అందుకే ఎదుటివారి నోరు మూయించలేం' అంటూ వివరణ ఇచ్చింది.
అసభ్యకరంగా కనిపించే డ్రెస్సింగ్ వేసుకుంటే, ప్రజల్లో విమర్శలు రావడం సహజమని, ఆ కామెంట్స్‌ని తట్టుకోగల ధైర్యం ఉన్నప్పుడు మాత్రమే అలాంటి అవుట్ఫిట్స్ ధరించాలని చెప్పింది. 'పబ్లిక్‌లోకిరాగానే, అసభ్యకరంగా కనిపించే విధంగా కాకుండా పద్దతిగా ఉండాలి. మీకు కామెంట్స్ భరించగల ధైర్యం ఉన్నప్పుడు మాత్రమే 'బోల్డ్' డ్రెస్సింగ్ ప్రయత్నించండి" అని కరాకండిగా చెప్పేసింది. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో నిబంధనలు, మర్యాద, సంస్కారంను విస్మరించకూడదని సూచించారు.
ప్రస్తుతం హీరోయిన్ ఇంద్రజ వ్యాఖ్యలు సోషల్ మీడియా వైరలవుతున్నాయి. కొందరు ఆమె అభిప్రాయాన్ని సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం డ్రెస్సింగ్ కూడా వ్యక్తిగత హక్కే కదా? అంటూ కౌంటర్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఇంద్రజ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ అంశం ఎలాంటి చర్చకు దారి తీస్తుందో వేచిచూడాలి.


Click it and Unblock the Notifications











