RRR: తారక్ సరసన నటించే హీరోయిన్ కోసం తెగ వెతుకుతున్నారు, ఆమె ఎవరంటే..?

నిన్న మొన్నటి వరకు 'RRR' ప్రాజెక్ట్ విషయంలో అనేక అనుమానాలు, పుకార్లు షికార్లు చేశాయి. గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో సందేహాలన్నింటికీ తెర దించుతూ దర్శకుడు రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఈ మీడియా సమావేశంలో 'RRR' కథ ఎలా ఉండబోతోంది? హీరోయిన్లు ఎవరు? ముఖ్య పాత్రల్లో కనిపించేది ఎవరు? అనే విషయాలను అఫీషియల్‌గా ప్రకటించారు.

యంగ్ కొమురం భీం పాత్రలో కనిపించే ఎన్టీఆర్ సరసన.... డైసీ ఎడ్గర్ జోన్స్ అనే విదేశీ నటి నటించబోతోందని రాజమౌళి ప్రకటించగానే అందరూ ఆమె కోసం ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఇంతకీ ఎవరీ డైసీ ఎడ్గర్ జోన్స్? ఆమె గురించి మరిన్ని వివరాలపై ఓ లుక్కేద్దాం.

డైసీ ఎడ్గర్ జోన్స్

డైసీ ఎడ్గర్ జోన్స్

డైసీ ఎడ్గర్ జోన్స్ బ్రిటన్లో పుట్టింది. అందరూ ఆమెను డైసీ అని పిలుస్తుంటారు. లండన్లో నివసిస్తోంది. ఐదేళ్ల వయసులోనే నటన మొదలు పెట్టింది. తన యాక్టింగ్ టాలెంటుతో కొందరి మాత్రమే అవకాశం లభించే నేషనల్‌ యూత్‌ థియేటర్‌లో 14 ఏళ్ల వయసులోనే చోటు దక్కించుకుంది.

నటనలో అనుభవం

నటనలో అనుభవం

డైసీ ఎడ్గర్ జోన్స్‌ ఎక్కువగా టెలివిజన్ సీరిస్‌లలో నటించింది. ఇప్పటి వరకు కోల్డ్‌ ఫీట్‌, వార్‌ ఆఫ్‌ ది వరల్డ్స్‌, జెంటిల్‌మాన్‌ జాక్‌, సైలంట్‌ విట్‌నెస్‌, ఔట్‌ నంబర్డ్‌ తదితర టీవీ సిరీస్‌, షోల్లో నటించింది. 2018లో వచ్చిన ‘పాండ్‌ లైఫ్‌' అనే సినిమాలో కాషీ అనే పాత్ర పోషించింది. దీంతో పాటు ‘వింటర్‌ సాంగ్‌' అనే షార్ట్‌ ఫిల్మ్‌లో నటించింది.

నటనతో పాటు ఇవి కూడా ఇష్టం

నటనతో పాటు ఇవి కూడా ఇష్టం

చిన్నతనం నుంచి డైసీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. చదువులు పెద్దగా ఎక్కక పోవడంతో దీన్నే తన ప్రొఫెషన్‌గా ఎంచుకుంది, నటనతో పాటు గిటార్‌ వాయించడం, పాటలు పాడటం, డ్యాన్స్‌ చేయడం, స్విమ్మింగ్‌ లాంటి వాటిని కూడా చాలా ఇష్టపడుతుంది.

ఫోటోగ్రఫీ, ట్రావెలింగ్ లవర్

ఫోటోగ్రఫీ, ట్రావెలింగ్ లవర్

ట్రావెలింగ్, ఫోటోగ్రీఫీ అంటే ఇష్టపడే డైసీ సమయం దొరికినప్పుడల్లా కెమెరా పట్టుకుని టూర్లు వేస్తుంది. తన ట్విట్టర్, ఇన్‌స్టా పేజీల్లో ఇందుకు సంబంధించిన ఫోటోలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X