సమంత కొడుకు ఎవరో తెలుసా.. దిమ్మతిరగడం ఖాయం!
స్టార్ హీరోయిన్ సమంత ప్రయోగాత్మక చిత్రాలు మొదలు పెడుతోంది. వివాహం తరువాత కూడా సమంత విజయాలతో దూసుకుపోతోంది. ఈ ఏడాది సమంత తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన రంగస్థలంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మహానటి, అభిమన్యుడు లాంటి హిట్ చిత్రాలు వచ్చాయి. యూ టర్న్ లాంటి లేడి ఓరియెంటెడ్ చిత్రంలో నటించిన సమంత మరో ప్రయోగానికి సిద్ధం అవుతోంది. నందిని రెడ్డి దర్శత్వంలో 70 ఏళ్ల వృద్దురాలిగా నటించేందుకు సిద్ధం అవుతోంది.

ఓ బేబీ ఎంత సక్కగున్నావే
నందిని రెడ్డి దర్శత్వంలో సమంత ఇటీవల ఓ చిత్రాన్ని ప్రారంభించింది. కొరియాలో ఘనవిజయం సాధించిన మిన్ గ్రానీ అనే చిత్రానికి ఇది రీమేక్. ఎంత సక్కగున్నావే అనే టైటిల్ పరిసిస్లిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో సమంత 70 ఏళ్ల వృద్ధురాలిగా నటించనుండడం పెద్ద సాహసమే అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో యువ హీరో నాగశౌర్య కీలక పాత్రలో నటించనున్నాడు.

ఫోటో స్టూడియోలో మొదలయ్యే కథ
70 ఏళ్ల వృద్ధురాలు ఫోటో తీయించుకునేందుకు ఫోటో స్టూడియోకు వెళుతుంది. ఫోటో తీయించుకుని బయటకు రాగానే తన పోలికలతో ఉండే 20 ఏళ్ల యువతకి కనిపిస్తుంది. వీరిద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనేదే ఈ చిత్ర కథ. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో సమంత కొడుకు పాత్రలో ఓ సీనియర్ నటుడు నటించబోతుందని ప్రచారం జరుగుతోంది.

రావు రమేష్
70 ఏళ్ల వృద్ధురాలైన సమంతకు ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రావు రమేష్ కొడుకట. సాధారణంగా రావు రమేష్ సమంత కన్నా వయసులో చాలా పెద్దవారు. ఇది ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే అయినా వీరి మధ్య సన్నివేశాలు ఎలా ఉంటాయో చూడాలి. సమంత కెరీర్ లో ఈ చిత్రం సరికొత్త ప్రయోగం అని చెప్పొచ్చు.

చైతూతో మరో చిత్రం
సమంత, నాగచైతన్య వివాహం అయ్యాక తొలిసారి జంటగా నటిస్తున్నారు. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మజిలీ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబకథా చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ చిత్రం ప్రేక్షకుల్ ముందుకు రానుంది. ఈ చిత్రంలో కూడా చైతు, సమంత భార్య భర్తలుగానే నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











