అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి.. అసలు ఆ వ్యాధి లక్షణాలు ఏంటి..?
సౌత్ ఇండియా సినిమా దగ్గర చాలా మంది స్టార్ హీరోలు హీరోయిన్స్ ఉన్నారు కానీ ఒక కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఒక కల్ట్ మార్కెట్ ని సొంతం చేసుకున్న హీరోలు హీరోయిన్ లు చాలా అరుదుగా ఉంటారు. మరి ఈ అరుదైన హీరోయిన్స్ లో అభిమానులు ఎంతో ప్రేమగా పిలుచుకునే స్వీటీ అనుష్క తప్పకుండ టాప్ లో ఉంటుంది.
అయితే అనుష్క రీసెంట్ గా యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తో "మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి" అనే ప్రయోగాత్మక ఎంటర్టైనర్ ని చేసి హిట్ కొట్టింది. ఇక ఈ హిట్ తో మళ్ళీ ట్రాక్ లోకి ఆమె వచ్చేసింది. కాగా స్వీటీ పాన్ ఇండియా సక్సెస్ బాహుబలి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఆసక్తికర సినిమాలు చేస్తూ వచ్చింది కానీ చాలా ఎక్కువ గ్యాప్ తీసుకుంది.

మధ్యలో ఆమె బరువు పెరగడం వంటివి కూడా జరిగాయి. దీనితో ఆమె ఆరోగ్యం ఏమన్నా బాగాలేదా అనే చర్చ కూడా వచ్చింది. అలా కొన్నాళ్ల కితం అనుష్క తనకి ఒక వింతైన జబ్బుతో బాధపడుతుంది చెప్పింది. అయితే అది ఇంకా తగ్గలేదు అన్నట్టుగా ఇపుడు కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే అనుష్క సూడో బల్బర్ అనే సిండ్రోమ్ తో బాధ పడుతుందట.
ఈ సిండ్రోమ్ ఉన్నవారు తమ నవ్వును కంట్రోల్ చేసుకోలేరట. చిన్న జోక్ చెప్పినా కూడా దాదాపు 10 నుంచో 15 నిమిషాలు [పైగానే తాము ఆపుదాం అనుకున్నా ఆపలేని రీతిలో నవ్వతూ ఉండిపోతారట. ఇది వినేందుకు ఆశ్చర్యంగానే ఉంది కానీ స్వీటీ ప్రస్తుతం దీనితోనే బాధ పడుతుందట.
అయితే ఈ సిండ్రోమ్ కారణంగా ఆమె షూటింగ్ కూడా చాలా సార్లు క్యాన్సిల్ చేయాల్సి వచ్చేది అని మెయిన్ గా కామెడీ సీన్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేదని తెలుస్తుంది. కాగా అనుష్క కి ఇంకా ఈ జబ్బు నుంచి విముక్తి కలగలేదని వినిపిస్తుంది. నవ్వటం ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటారు కానీ ఈ రీతిలో ఎవరికైనా ఉంటే అది బాధాకరమే అని చెప్పాలి.

మరి అనుష్క దీని నుంచి ఎప్పుడు కోలుకుంటుందో చూడాలి. కాగా ఇప్పుడు అనుష్క ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో చేస్తున్న చిత్రం "ఘాటీ" షూటింగ్ లో బిజీగా ఉంది. నిన్ననే ఈ సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్ లో ఆరంభం అయినట్టుగా టాక్.
మరి క్రిష్ తో అనుష్క "వేదం" సినిమా తర్వాత రెండోసారి సినిమా చేస్తుంది. ఘాటీ సినిమా కొన్ని నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కిస్తుండగా ప్రముఖ నిర్మాణం సంస్థ యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. అలాగే వీరితో అనుష్క మిర్చి, భాగమతి తర్వాత మూడో సినిమాగా దీనిని చేస్తుంది.


Click it and Unblock the Notifications











