Renu Desai Tattoo పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు రేణు దేశాయ్ ఝలక్.. ఆ టాటూ వెనుక అంత అర్థం ఉందా?
రేణు దేశాయ్ సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఓ కొత్త టాటూతో మరోసారి పవన్ అభిమానుల దృష్టిని తనవైపుకు తిప్పుకుంది రేణూ. ముఖ్యంగా రేణూ తన టాటూతో పవర్ స్టార్ అభిమానులకు గట్టి జలక్ ఇచ్చిందనే టాక్ నడుస్తోంది. మరి ఇంతకీ ఆమె టాటూ కు అర్థం ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఎప్పుడు రేణూ దేశాయ్ పై ఎప్పుడూ ఓ కన్ను వేసే ఉంచుతారు. తాజాగా ఈమె టాటూ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ పర్సనల్ లైఫ్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఈమె రిలేషన్ బ్రేక్ అయినప్పటికీ, ఆయన అభిమానులు మాత్రం రేణును వదలట్లేదు.

విడాకులు తీసుకున్న కొత్తలో పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసి, మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన రేణు దేశాయ్ ప్రస్తుతం వాటన్నింటినీ పక్కన పెట్టి తన కూతురు, కొడుకుతో బిజీ అయిపోయింది. గతంలో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తనతో వ్యవహరించిన తీరు తప్పని, కానీ రాజకీయాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ కు ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే.
ఇక రేణూ కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్యకి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా రేణు దేశాయ్ తన చేతికి వేయించుకున్న కొత్త టాటూను చూపిస్తూ ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఆమె చేతిపై మౌనం పరం శీలం అనే కొటేషన్ ని టాటూగా వేయించుకోవడం ఆ ఫోటోలో కనిపిస్తోంది. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ అది ఇంకా గమనించి చూస్తే కొటేషన్ పక్కన కమలం పువ్వు గుర్తు కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఈ పోస్ట్ కి రేణు దేశాయ్ ట్యాగ్ చేసిన కామెంట్ మరో ఇంట్రెస్టింగ్ అంశం. కొన్నిసార్లు మాటలు కంటే ఇలాంటి ఫోటోలే గట్టిగా వినిపిస్తాయి అంటూ రేణూ గట్టిగానే ఇచ్చి పడేసింది. దీంతో ఇంతకీ ఆమె పోస్ట్ చేసిన ఆ టాటూకి అర్థం ఏంటి అని డీకోడ్ చేయడం మొదలు పెట్టారు పవన్ ఫ్యాన్స్.
ఈ క్రమంలోనే రేణూ చేతిపై ఉన్న కమలం గుర్తును పాలిటిక్స్ తో ముడి పెట్టి చూస్తున్నారు. ఎందుకంటే తన పోస్ట్ చివర్లో రేణు ఎలక్షన్ 2024 అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించింది. దీంతో ఆమె పరోక్షంగా ఈ ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేస్తుందని గట్టిగా నమ్ముతున్నారు.
నిన్న మొన్నటిదాకా మాజీ భర్త పవన్ కళ్యాణ్ కు ఒక్క అవకాశం ఇవ్వమని కోరిన రేణూ సడన్ గా ఇలా ప్లేటు ఫిరాయించడం ఏంటా అనే ఆలోచనలో పడిపోయారు జనసైనికులు. కానీ కొంతమంది మాత్రం ఏపీలో ప్రస్తుతం జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ, ఆమె బీజేపీకి సపోర్ట్ చేస్తే జనసేనకి కూడా మద్దతు ఇచ్చినట్టే అని స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











