'జానకీదేవి'గా సమంత.. దిల్ రాజు నిర్మాతగా 96 రీమేక్!

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 96 చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్లు ఇది వరకే ప్రకటించారు. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 చిత్రం ఘన విజయం సాధించింది. తెలుగులో కూడా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని సినిమా ప్రారంభం కాకముందే దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు. 96 రీమేక్ లో సమంత, శర్వానంద్ జంటగా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలనేది దిల్ రాజు ప్లాన్. తాజాగా ఈ చిత్ర టైటిల్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. మొదట ఈ చిత్రానికి జాను, జాను అలియాజ్ జానకి అనే టైటిల్స్ పరిశీలించారు. తాజాగా 'జానకి దేవి' అనే టైటిల్ ని దిల్ రాజు ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్లు వార్తలు వస్తున్నాయి.

Interesting title for Sharwanand, Samanthas 96 remake

ఈ చిత్ర టైటిల్ లోగోని ఈ నెల 6న శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ వర్షన్ ని డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే తెలుగు రీమేక్ ని కూడా తెరకెక్కిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర కథని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చే పనిలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X