IPL 2024 ఐపీఎల్‌లో 435 రోజుల తర్వాత రిషబ్ పంత్.. DC మ్యాచ్‌కు టికెట్ వచ్చిందా? ఊర్వశీ రౌటేలాపై సెటైర్స్!
తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హాట్ హీరోయిన్ బాలీవుడ్ భామ ఊర్వశీ రౌటేలా. ఇటీవల ఆమె మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య, పవన్ కల్యాణ్‌తో బ్రో సినిమాలో స్పెషల్ సాంగ్స్‌లో నటించి తన గ్లామర్‌తో ఆకట్టుకొన్నది. ఇక తాజాగా నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నది.
అయితే తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు రాజకీయాల్లోకి ప్రవేశించే విషయంపై దృష్టి పెట్టింది. ఆసియాలో అత్యధిక పిన్న వయసు ఉన్న రాజకీయాల్లోకి వెళ్లేందుకు టికెట్ లభించింది అని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయంపై స్పందించింది. తాజాగా బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ..

రాజకీయాల్లోకి ప్రవేశించి ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటికే ఓ పార్టీ టికెట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. అయితే నేను రాజకీయాల్లోకి వెళ్లాలా? లేదా అనే సందేహంతో ఉన్నాను. నేను ఇంకా పాలిటిక్స్‌లో వెళ్లాలా? వద్దా అని నిర్ణయం తీసుకోలేదు. ఇక ముందైనా పాలిటిక్స్‌లోకి వెళ్తానా? లేదా అనే విషయంపై కూడా క్లారిటీ లేదు అని ఊర్వశీ రౌటేలా చెప్పింది.
ఇక తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తే.. ఎలా ఉంటుందో అనే విషయం గురించి అభిమానులను అడిగి తెలుసుకోవాలని ఉంది. నా ఫ్యాన్స్ నుంచి వాళ్ల అభిప్రాయాలను తెలుసుకొంటాను. ఒకవేళ వారికి ఇష్టం ఉంటే నేను రాజకీయాల్లోకి వెళ్లడానికి సిద్దమే అని ఆమె అన్నారు. అయితే ఇంతకు ఏ పార్టీ టికెట్ ఆఫర్ ఇచ్చిందో చెప్పకుండానే జవాబు దాట వేసింది.
అయితే ఊర్వశీ రౌటేలా రాజకీయాల్లోకి వెళ్లాలనే విషయంపై నెటిజన్లు సెటైర్లతో ట్రోల్ చేశారు. ఊర్వశీకి నిజంగా టికెట్ ఏదైనా పార్టీ టికెట్ ఇస్తే.. అతి చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చిన హీరోయిన్‌గా ఆమె క్రెడిట్ సొంతం చేసుకొంటుంది. కానీ ఆమెకు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వదు. బహుశా ఐపీఎల్‌లో ఢిల్లీ కాపిటల్ (DC) మ్యాచ్ చూడటానికి టికెట్ వచ్చిందేమో అని ఓ నెటిజన్ సెటైర్ వేశాడు.

ఇక ఊర్వశి రౌటేలా కామెంట్స్‌పై నెటిజన్లు తలో రకంగా కామెంట్స్ వదిలారు. బహుశా ఆమె పీవీఆర్ మల్టీప్లెక్స్‌లో సినిమా చూడటానికి టికెట్ వచ్చి ఉంటుందేమో. అంతేకానీ ఆమెకు రాజకీయాల్లోకి పిలిచి టికెట్ ఇచ్చేంత సీన్ లేదు అని నెటిజన్లు సెటైర్లు వేశార. ఒకవేళ ఆమె బలంగా కోరుకొంటే ఉత్తరాఖండ్ రాజకీయాల్లోకి ప్రవేశించి టికెట్ సాధిస్తుందో వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉండగా, ఐపీఎల్ క్రికెట్ లీగ్ ఘనంగా ఆరంభమైంది. ఊర్వశీ రౌటేలాకు నచ్చిన క్రికెటర్ రిషబ్ పంత్ 2022 డిసెంబర్‌లో యాక్సిడెంట్ తర్వాత సుమారు 435 రోజులకు తిరిగి ఢిల్లీ జట్టులో చేరి కెప్టెన్సీ వహిస్తున్నాడు. మళ్లీ రిషబ్ జట్టులో చేరడంతో ఆయన ఆడే మ్యాచులకు ఊర్వశీ రౌటేలా హాజరవుతారని సినీ, క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











