9000 కోట్ల స్పెషల్ గిఫ్ట్.. జాక్వలైన్ ఫెర్నాండేజ్ కోసం ప్రియుడు క్రేజీ ఆఫర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) ప్రారంభానికి ముందే మైదానం వెలుపల పలు విషయాలు సంచలనం రేపుతున్నాయి. ఈ టోర్నీలో కీలక జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనుగోలుపై ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకొంటున్నాయి. ఈ జట్టును సొంతం చేసుకొనేందుకు ఇండియాలోని టాప్ బిజినెస్ వర్గాలు, వివాదాస్పద ప్రముఖులు పావులు కదుపుతున్నారు. అయితే ఈ జట్టును కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్న వ్యక్తుల వివరాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఈ జట్టు కొనుగోలు వ్యవహారంలో బయటకు వస్తున్న విషయాలు, మీడియాలో ప్రచారం అవుతున్న వివరాల్లోకి వెళితే..
టీ20 ఫార్మాట్‌లో జరిగే క్రికెట్ పోటీలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా యజమానిగా ఉండేవారు. ఆ తర్వాత డియాగో యజమాని పగ్గాలు చేతపట్టారు. అయితే ఐపీఎల్ 2026 ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో జట్టును అమ్మకానికి పెడుతున్నామనే వార్తను మార్కెట్‌లోకి వదిలారు. దాంతో ఆ జట్టును కొనుగోలు చేసేందుకు పలు పేర్లు మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే RCB జట్టుకు వెన్నెముక లాంటి విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ పేరిట జట్టును కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపుతున్నారనే విషయం మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ నటి, తన జీవిత భాగస్వామి పేరిట కొంత వాటాను కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్త ఓ వైపు కొనసాగుతుండగానే.. మరోవైపు మాఫియా డాన్, తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న కరుడు గట్టిన నేరస్థుడు సుఖేష్ చంద్రశేఖర్, అదర్ పూరన్‌వాలా పేర్లు అనూహ్యంగా తెరపైకి వచ్చాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేసేందుకు తాను సిద్దంగా ఉన్నాను అంటూ డియాజియోకు సుఖేష్ చంద్రశేఖరన్ లేఖ రాయడం క్రీడా ప్రపంచంలో ప్రకంపనలు రేపాయి. ఈ ఐపీఎల్ జట్టును తన కంపెనీ LS కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నది. ఈ జట్టును సుమారుగా 1 బిలియన్ డాలర్లు అంటే సుమారుగా 9000 కోట్ల రూపాయలు చెల్లించడానికి సిద్దంగా ఉంది. మీకు డీల్ ఒకే అయితే చెప్పండి.. తాము కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నామని లేఖలో పేర్కొన్నట్టు సమాచారం.
అయితే సుఖేష్ ఆఫర్‌కు ముందు పారిశ్రామిక వేతత్ అదర్ పూరన్‌వాలా ఆర్సీబీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. అయితే తాను పూరన్‌వాలా కంటే ఎక్కువ మొత్తాన్ని ఇస్తాను. అలాగే యువ క్రికెటర్లను భావితరాలకు స్పూర్తిని అందించే విధంగా, అలాగే భారత క్రికెట్ భవిష్యత్‌కు పాటుపడేలా చర్యలు తీసుకోవడమే తన లక్ష్యమని ఆయన లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది.
ఇదిలా ఉండగా, సుఖేష్ చంద్రశేఖర్‌తో బాలీవుడ్ నటి జాక్వలైన్ ఫెర్నాండేజ్ రిలేషన్‌షిప్‌లో కొనసాగుతున్నారు. తీహార్ జైలు నుంచి ఆమెతో డేటింగ్ చేయడం నేర, రాజకీయ ప్రపంచంలో హాట్ టాపిక్ అయింది. అయితే తన ప్రియురాలు జాక్వలైన్‌కు ఆర్సీబీ జట్టును బహుమతిగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
తమిళనాడుకు చెందిన సుఖేష్ చంద్రశేఖర్ గతంలో పలు నేరాల్లో నిందితుడుగా తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. గతంలో రాన్ బాక్సీ ప్రమోటర్లను బలవంతపు వసూళ్లకు పాల్పడిన కేసులో సుఖేష్‌ను అరెస్ట్ చేశారు. సుఖేష్ చంద్రశేఖర్‌పై 215 కోట్ల మేర బలవంతపు వసూళ్లకు పాల్పడినట్టు ఈడీ గుర్తించింది. ఈ కేసులో ఆయనను, అలాగే జాక్వలైన్ ఫెర్నాండేజ్‌ను పలు మార్లు విచారించడం తెలిసిందే.


Click it and Unblock the Notifications











