మళ్లీ ప్రేమలో పడ్డ హీరో విశాల్.. ఈసారి ప్రియురాలిగా మారిన హీరోయిన్ ఎవరంటే?
సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల జీవితాలు మనం అనుకున్న ఈజీగా ఉండదు. వారు ఎంత ఫేమస్ అయినా ప్రైవేట్ స్పేస్ చాలా తక్కువ. వారు ఏ చిన్న పనిచేసినా.. ఎవరితో కలిసి తిరిగినా ఇట్టే వైరలవుతోంది.మరుక్షణంలో వారి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఎక్కడలేని పుకారు షికార్లు చేస్తూ ఉంటాయి. అలా తమిళ స్టార్ హీరో విశాల్ పై కూడా ఎక్కలేని రూమర్స్ వస్తున్నాయి. మనోడు తన లవర్ ను మార్చేశాడని, మరో యంగ్ హీరోయిన్ తో రిలేషన్ కొనసాగిస్తున్నాడంటూ లేనిపోని రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..
తమిళ స్టార్ హీరో విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా విశాల్ సినిమాలు విడుదలవుతుంటాయి. ఈ సినిమాలను తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇలా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు హీరో విశాల్. తాజాగా ఆయన నటించిన మదగజరాజా సినిమా 2013 నుంచి విడుదల వాయిదా పడుతూ.. ఎట్టకేలకు 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. అలాగే.. తెలుగు ఆడియన్స్ నుంచి ఆదరణ అందుకుంటుంది.

ఇలా తమిళ ప్రేక్షకులతో పాటు, ఇటు తెలుగు ప్రేక్షకుల కూడా మెప్పిస్తున్నాడు. సక్సెస్ పుల్ కెరీర్ కొనసాగిస్తున్న ఈ హీరో నాలుగు పదులు వయసు వచ్చినా ఇంకా బ్యాచ్‌లర్‌గానే ఉంటున్నారు. దీంతో ఆయన పెళ్లిపై లేనిపోని రూమార్స్ క్రియేట్ అవుతున్నాయి. ఆ మధ్యకాలంలో హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్‌తో ప్రేమాయణం నడుపుతున్నారని..వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు పెద్దఎత్తునే వచ్చాయి. అయితే.. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ..ఇద్దరికీ మనస్పర్థలు వచ్చి విడిపోయారు.
ఆ తరువాత హీరో విశాల్ కు మరో అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. కానీ, ఆ ఎంగేజ్మేంట్.. పెళ్లి వరకు పోకుండా ఆగిపోయింది. తాజాగా హీరో విశాల్ పై మరోసారి రూమర్స్ వస్తున్నాయి. మనోడు తన లవర్ ను మార్చేశాడని, యంగ్ హీరోయిన్ అభినయతో డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. వీరిద్దరూ జంటగా పూజ, మార్క్ ఆంటోనీ సినిమాల్లో కలిసి నటించారు. అయితే విశాల్ తో డేటింగ్ వస్తున్న వార్తలపై హీరోయిన్ అభినయ స్పందించారు. వారి మధ్య ఉన్న రిలేషన్ పై క్లారిటీ ఇచ్చింది.

విశాల్ తో డేటింగ్ లో ఉన్న వార్తలను తీవ్రంగా ఖండించింది. తనకు ఆల్రెడీ లవర్ ఉన్నారనీ, తనపై లేనిపోని ప్రేమ గాసిప్‌లు ప్రచారం చేయవద్దని అభినయ కోరింది. తాను గత 15 సంవత్సరాలుగా ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నాననీ, అతడు తన చిన్ననాటి స్నేహితుడిని వెల్లడించింది. మాకు తెలియకుండానే తామిద్దరం ప్రేమించుకోవడం మొదలుపెట్టామని, దయచేసి తనను వేరే వాళ్లతో రిలేషన్,లవ్ ఉందంటూ లేనిపోని రూమార్స్ క్రియేట్ చేయకూడదంటూ రిక్వెస్ట్ చేసింది. అయితే.. ఆ అబ్బాయి ఎవరనే విషయం మాత్రం హీరోయిన్ అభినయ బయటపెట్టలేదు.మొత్తానికి విశాల్ లవ్ రూమార్స్ కు చెక్ పెట్టింది.
హీరోయిన్ అభినయ చిన్నప్పటి నుంచి మూగ, చెవిటి అయిన.. తనపై ఉన్న నమ్మకంతో నేడు నటిగా రాణిస్తోంది. 2008లో 'నేనింతే' అనే సినిమాతో అభినయ తొలిసారిగా నటించింది. ఆ తరువాత 'శంభో శివ శంభో'తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ తరువాత 'నాడోడిగులు'తో తమిళంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాకు ఆమె ఉత్తమ తొలి నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు, ఉత్తమ సహాయ నటిగా విజయ్ అవార్డుతో సహా అనేక అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమా విజయంతో అభినయకు వరుస సినిమాల్లో నటించే అవకాశాన్ని అందుకుంది.
ఇలా ఒరువన్, ఈషాన్, జీనియస్, వీరమ్, పూజై, మార్క్ ఆంటోని వంటి పలు సినిమాల్లో అభినయ నటించారు. తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మహేష్, వెంకటేష్ కి చెల్లి గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్‌గా మలయాళ చిత్రం 'పని' (Pani)తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అభినయ. జోజూ జార్జ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆమెపై చిత్రీకరించిన అత్యాచార సన్నివేశం చాలా వివాదాస్పదమైంది. జోజూ జార్జ్ మేకింగ్‌ను చాలామంది తప్పుపట్టారు. కానీ, అభినయ ఆరోపణలు కొట్టిపారేసింది.


Click it and Unblock the Notifications











