సెన్సేషనల్ రీమేక్‌లో ప్రియమణి.. క్రేజీ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన అందాల భామ

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా తమిళనాడులో సంచలన విజయం సాధించిన చిత్రం అసురన్. సెన్సేషనల్ డైరెక్టర్ వెట్రీమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులు, సినీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించింది. అంతేకాకుండా 2019లో బిగ్గెస్ట్ హిట్‌గా ఓ రికార్డును క్రియేట్ చేసింది. హీరో ధనుష్‌ మంచి పేరు తెచ్చిపెట్టింది.

తమిళంలో లభించిన విజయోత్సాహంతో అసురన్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కలైపులి థాను తెలుగులో రీమేక్ సిద్ధమయ్యారు. ఇక ఈ చిత్రంలో నటించే నటీనటుల ఎంపిక ప్రస్తుతం దక్షిణాదిలో చర్చనీయాంశమవుతున్నదని పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే..

విక్టరీ వెంకటేష్ సరసన

విక్టరీ వెంకటేష్ సరసన

ప్రముఖ నిర్మాతలు కలైపులి థాను, డి సురేష్ సంయుక్తంగా రూపొందిస్తున్న అసురన్ రీమేక్‌కు తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. 2019లో వరుస హిట్లతో జోష్ మీద ఉన్న విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వెంకటేష్ సరసన హీరోయిన్ ఎవరనే విషయం క్రేజీగా మారింది.

మంజు వారియర్‌ రోల్ కోసం అనుష్క, శ్రీయ

మంజు వారియర్‌ రోల్ కోసం అనుష్క, శ్రీయ

అసురన్‌లో పూర్తిగా డీ గ్లామర్ పాత్రలో నటించి మెప్పించిన మంజు వారియర్‌ స్థానంలో అనేక పేర్లు తెరపైకి వచ్చాయి. కొన్ని రోజులగా అనుష్క శెట్టి, శ్రీయా సరన్ పేర్లు గట్టిగానే వినిపించాయి. అయితే చివరకు ప్రియమణిని ఆ పాత్ర వరించినట్టు ఓ వార్త మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మేరకు మంజు వారియర్ పోషించిన పాత్రలో నటించేందుకు ఆసక్తిని చూపి అగ్రిమెంట్‌పై సంతకం చేసినట్టు తాజా సమాచారం.

ఛాన్స్ కొట్టేసిన ప్రియమణి

ఛాన్స్ కొట్టేసిన ప్రియమణి

అసురన్‌లో మంజు వారియర్ పాత్ర చాలా కీలకమైనది. కథకు బలంగా మారిన రోల్‌లో కనిపించి మెప్పించారు. ఇక ప్రియమణి గతంలో డీ గ్లామరైజ్డ్ రోల్స్‌తో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకొన్నారనే విషయం తెలిసిందే. అయితే తెలుగు విషయానికి వస్తే ప్రియమణి పాత్ర అంతగా ముతకగా ఉండదనే మాట వినిపిస్తున్నది.

 తమిళంలో నవల ఆధారంగా అసురన్

తమిళంలో నవల ఆధారంగా అసురన్

అసురన్ విషయానికి వస్తే తమిళంలో వెక్కై అనే నవల ఆధారంగా తెరకెక్కింది. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పూమణి ఈ పుస్తకాన్ని రచించారు. గ్రామంలో భూమి కోసం జరిగే ఓ కుటుంబం జరిపిన సంఘర్షణను ఎమోషనల్‌గా తెరకెక్కించారు. ప్రస్తుతం తెలుగు రీమేక్‌కు వరుస ఫ్లాప్‌లతో సతమతం అవుతున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను అసురన్ రీమేక్‌కు ఎంపిక చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X