బాయ్‌ఫ్రెండ్‌తో వరలక్ష్మీ శరత్ కుమార్ డిస్టినేషన్ వెడ్డింగ్.. మ్యారేజ్, రిసెప్షన్ ఎప్పుడు? ఎక్కడంటే?
సినీ పరిశ్రమలో దిగ్గజ నటుల పిల్లల పెళ్లిళ్ల సీజన్ వైభవంగా సాగుతున్నది. ఇటీవలే అర్జున్ సర్జా కూతురు పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. అదే విధంగా దక్షిణాదిలో మరో అగ్ర నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ పెళ్లి భజాలు మోగేందుకు సిద్దంగా ఉన్నాయి. అయితే డిస్టినేషన్ వెడ్డింగ్‌గా సాగే ఈ పెళ్లి గురించిన వివరాల్లోకి వెళితే..
తమిళంలో తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయాళ రంగంలోకి అడుగపెట్టారు. అయితే ఇటీవల కాలంలో ఆమె మిగితా భాషల్లో కంటే తెలుగులోనే మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు. అగ్ర హీరోలకు సమానమైన పాత్రల్లో నటించడమే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రల్లో కూడా నటించి మెప్పిస్తున్నారు.

యాంగ్రీ యంగ్ ఉమెన్‌గా కనిపించే వరలక్ష్మీ శరత్ కుమార్ జీవితంలో అఫైర్లు, డేటింగ్స్ వార్తలు ఉన్నాయి. గతంలో విశాల్‌తో ప్రేమాయణం జరిపిందనే వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి. అయితే వారిద్దరూ పెళ్లి కూడా చేసుకొంటారనే గుసగుసలు వినిపించాయి. అయితే ఏం జరిగిందో వారిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది.
అయితే అనూహ్యంగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ప్రత్యక్షమైంది. నికోలాయ్ సచ్‌దేవ్ కొంతకాలంగా ఆమె డేటింగ్ చేస్తూ వస్తున్నది. అయితే వారిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో ఇరు కుటుంబాలు కూడా అంగీకరించాయి. దాంతో వారి వివాహం జూలై 2వ తేదీన నిర్వహించేందుకు ముహుర్తం నిర్ణయించారు.
ఇటీవల తన వెడ్డింగ్స్ కార్డును సినీ, రాజకీయ ప్రముఖులకు అందజేశారు. రజనీకాంత్, చంద్రబాబు నాయుడు, గోపిచంద్ మలినేని, బాలకృష్ణ, హరీష్ శంకర్, రవితేజ తదితరులను కలిసి వివాహా ఆహ్వాన పత్రికను అందిచారు. ఇంకా పలువురు సెలబ్రిటీలను కూడా పెళ్లికి పిలవడం తెలిసిందే.

అయితే నికోలాయ్, వరలక్ష్మీ వివాహం తొలుత థాయ్‌లాండ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరుగుతుంది. ఆ తర్వాత చెన్నైలోని విలాసిని సరై లీలా అనే ఫంక్షన్ హాల్‌లో పెళ్లి రిసెప్షన్ జరుగుతుంది అని వెడ్డింగ్ కార్డులో తెలియజేశారు. అయితే థాయ్‌లాండ్‌లో జరిగే వెడ్డింగ్ కోసం ఎవరెవరూ వెళ్తారనే విషయం వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











