Sushanth Singh Rajput అమ్మకానికి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇల్లు.. భారీ ధరకు కొనడానికి సిద్దమైన తెలుగు హీరోయిన్!

దక్షిణాది, హిందీ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న అదాశర్మ ఇటీవల కాలంలో రకరకాల కారణాలతో వార్తల్లో నిలుస్తున్నారు. చాలా రోజులుగా మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఆమె 2023 సంవత్సరంలో తన ఖాతాలో హిట్‌ను వేసుకొన్నారు. అయితే తాజాగా ఆమె సొంతింటి కలను నెరవేర్చుకొనే పనిలో ఉన్నారు. అయితే ఆమె ఇంటి కొనుగోలు వ్యవహారం మీడియాలో భారీ చర్చకు దారి తీసింది. ఆ వార్త వివరాల్లోకి వెళితే...

అదా శర్మ కెరీర్ విషయానికి వస్తే.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా హిట్ అయినప్పటికీ.. టాలీవుడ్‌లో స్థిరపడలేకపోయింది. ఆ తర్వాత తెలుగు, హిందీ సినిమాల్లో నటించినప్పటీకి.. స్టార్ స్టాటస్‌ను సాధించలేకపోయింది.

Is Adah Sharma Buying Sushanth Singh Rajputs house in Mumbai after The Kerala Story Success?

అయితే ఇటీవల రిలీజైన కేరళ స్టోరి సినిమాతో తన కెరీర్‌లోనే భారీ హిట్ అందుకొన్నది. ది కేరళ స్టోరి సినిమా సుమారుగా 200 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. దాంతో ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌ ఘనంగా మొదలైంది. ఈ సినిమా తర్వాత అదాశర్మకు బాలీవుడ్‌లో మంచి ఆఫర్లు వస్తున్నాయి.

‌ఇదిలా ఉండగా, అదా శర్మ ఇప్పటి వరకు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నది. అయితే తాజాగా తనకంటూ ఓ సొంత ఇల్లు ఉండాలని భావించిన ఆమె.. ఇంటి కోసం వేట ప్రారంభించింది. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటిని కొనుగోలు చేస్తుందనే వార్త బయటకు వచ్చింది. అయితే ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

Is Adah Sharma Buying Sushanth Singh Rajputs house in Mumbai after The Kerala Story Success?

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటిని కొనుగోలు చేస్తున్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నేను కొనుగోలు చేయాల్సి వస్తే.. ఇలా నేను ఆ విషయాన్ని చెప్పను. నాకు నచ్చినప్పుడు.. నాకు ఇష్టమైన రీతిలో సమయంలో వెల్లడిస్తాను. అప్పటి వరకు ఎవరికి తోచినట్టు వాళ్లు రాసుకొండి అంటూ అదాశర్మ కామెంట్ చేసింది.

బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్‌పుత్ కరోనా వైరస్ లాక్ డౌన్ తర్వాత అనుమానాస్పద పరిస్థితుల్లో బాంద్రాలోని తన ఇంటిలో మరణించడం అత్యంత వివాదంగా మారింది. ఆయన కుటుంబ సభ్యులు అతడికి సంబంధించిన ఆస్తులను అమ్మేందుకు సిద్దమయ్యారనే విషయం మీడియాలో కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అదాశర్మ ఆ ఇంటిని భారీ మొత్తానికి కొనుగోలు చేయడానికి రెడీ అవుతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X