Aishwarya Rai: ఇక ఆపండ్రా బాబు! ఐశ్యర్య ఎంత పెద్ద సమస్య బాధపడుతుందో తెలుసా?
Aishwarya Rai : బాలీవుడ్ ఐకాన్ బ్యూటీ, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తన అంద చందాలతోనే కాదు నటనతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్ ను సంపాదించుకుంది. గత కొంతకాలంగా తరుచు వార్తల్లో నిలిచిన మాజీ మిస్ వర్డల్ ఐశ్వర్య మరోసారి వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ ఓ అనారోగ్య సమస్యతో తీవ్రంగా బాధపడుతుండట. అయితే.. ఆ విషయం తెలియకుండా నెటిజన్లు ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ షాకింగ్ పోస్టు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అసలు బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ ఏ సమస్యతో బాధపడుతోంది ? ఇంతకీ ఆమెకు ఏమైంది? మీరు కూడా ఓ లూక్కేయండీ.
గత కొంతకాలంగా బాలీవుడ్‌లో ఐశ్వర్యరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ విడాకుల గురించిన రూమర్ జాతీయ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే భర్తతోనే కాకుండా తన మరదలు, అత్తతో గొడవల కారణంగా సపరేట్ కావాలని ఐశ్వర్య నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో ప్రపంచంలో అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ ఇంటిలో జరిగిన వివాహానికి ఐశ్యర్య తన భర్త అభిషేక్, తన ఫ్యామిలీతో రాకుండా తన కూతురుతో కలిసి వేర్వేరుగా రావడంతో అనుమానాలు మరింతగా బలపడ్డాయి.

ఈ క్రమంలో ఐశ్వర్య రాయ్ తన వెడ్డింగ్ రింగ్‌ను ధరించకపోవడంతో మరోసారి విడాకుల రూమర్ భగ్గుమన్నది. అభిషేక్‌తో ఆమె బంధాన్ని తెగతెంపులు చేసుకుందని, ఆ విషయాన్ని చెప్పకనే చెప్పిందంటూ వార్తలు వైరలయ్యాయి. ఈ రూమార్స్ అన్నింటికీ ఐశ్వర్య చాలా స్మార్ట్ గా పుల్‌స్టాప్ పెట్టింది.ఇటీవల పారిష్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్న తన కూతురు ఆరాధ్యతో పాల్గొన్న ఐశ్యర్య తన చేతికి వెడ్డింగ్ రింగ్ ధరించి కనిపించింది. ఫోటోలను స్టీల్స్ ఇచ్చింది. ఇలా విడాకుల రూమర్లకు తెర దించే ప్రయత్నం చేసింది మాజీ మిస్ వర్డల్.
ఒకే అన్ని సెట్ అనే తరుణంలో మరో సారి షాకింగ్ ఇష్యూతో ఐశ్వర్య రాయ్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల పారిస్ ఫ్యాషన్ వీక్‌కు కుమార్తె ఆరాధ్యతో కలిసి ఐశ్వర్యా రాయ్ హాజరైంది. లోరియల్ ప్యారస్ కు బ్రాండ్ అంబాసీడర్ అయినా ఐశ్వర్య లారియల్ ఫ్యాషన్ వీక్ 2024లో భాగంగా ర్యాంప్ వాక్ చేసింది. రెడ్ కలర్ బబుల్ హేమ్ గౌన్‌లో ఐశ్వర్య చాలా స్టైలిష్‌గా కనిపించింది. ఈ సమయంలో ఐశ్వర్య కెమెరాకు పోజులిచ్చింది. ఈ సమయంలో వెడ్డింగ్ రింగ్ చూపించి విడాకులంటూ సాగుతున్న ప్రచారానికి తెర దించింది.

కానీ, ఈ ఈవెంట్ లో ఐశ్వర్య లూక్స్, డ్రెస్సింగ్ పై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తూ.. ట్రోల్స్ చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు ఆమెపై బాడీ షేమింగ్ కామెంట్స్ కూడా చేశారు. డైటింగ్, వ్యాయామంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ క్రమంలో Reddit పోస్ట్ లో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య చాలా సంవత్సరాలుగా ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు రెడ్డిట్ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీని కారణంగానే ఐశ్వర్య ఇతర బాలీవుడ్ హీరోయిన్స్ లాగా ఆహార అలవాట్లను పాటించలేకపోతుందనీ, బరువు తగ్గించుకోవడానికి ఎలాంటి మందులు లేదా సప్లిమెంట్లను తీసుకోలేకపోతోందని రెడ్డిట్ పోస్ట్‌లో వ్రాయబడింది.
'నా స్నేహితురాలు, బాలీవుడ్ నటి ఐశ్వర్య కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆ సమస్య ఏంటో నేను వెల్లడించను. కానీ, ఆ అనారోగ్య సమస్య కారణంగానే .. ఆమె సరైన ఆహార పద్దతులను, కఠినమైన వ్యాయామం చేయలేకపోతుంది. దీని కారణంగా ఆమె బరువు పెరుగుతోంది. ఆ అనారోగ్య సమస్య కారణంగా ఆమె బరువు తగ్గించే మందులు తీసుకోలేకపోతుంది. ఆమె శరీరానికి అనుగుణంగా దుస్తులు ధరించడానికి ఇష్టపడుతుంది.' అని పేర్కొనబడింది. అయితే.. ఇప్పటి వరకు, ఐశ్వర్య రాయ్ గానీ, ఆమె కుటుంబం గానీ ఈ సమస్య గురించి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ప్రస్తుతం ఐశ్వర్య సైలెంట్‌గా ఉండి వృత్తి జీవితంపైనే దృష్టి సారిస్తోంది.


Click it and Unblock the Notifications











