Jigra: ఆలియా భట్ చీటింగ్.. రెడ్ హ్యాండెడ్‌గా అలా బుక్కైన సీత!

ప్రస్తుతం ఇండియా సినిమా దగ్గర ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ అని ఏమీ లేదు. మొత్తం అంతా కలిపి ఒకటే ఇండస్ట్రీగా మారిపోయి ప్రతీ భాషకి చెందిన నటీనటుల నుంచి దర్శకులు ఇతర టెక్నీషియన్స్ కూడా ఒకరితో కలిసి ఒకరు వర్క్ చేస్తున్నారు. ఇలా టాలీవుడ్ దగ్గర కూడా చాలా మంది నటీనటులు నటించేందుకు ఆసక్తి కనబరుస్తుండగా తెలుగు మార్కెట్ పై కూడా పట్టు సాధించాలని వారు కోరుకుంటున్నారు.

కాగా ఇలా నార్త్ నుంచి పలువురు హీరోలు సహా హీరోయిన్స్ కూడా తెలుగు మార్కెట్ పై కన్నేస్తున్నారు. మరి గత ఏడాదిలోనే స్టార్ హీరో రన్బీర్ కపూర్ హీరోగా నటించిన ఆనిమల్ సినిమా ఏకంగా 100 కోట్ల దగ్గర వసూళ్లు ఒక్క తెలుగు వెర్షన్ లోనే రాబట్టింది. ఇక దీనితో తర్వాత బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తెలుగులో మాస్ చిత్రం "దేవర" తో ఎంట్రీ ఇచ్చింది.

is alia bhatt cheated telugu Audience with Tele Promptor in jigra pre release in Hyderabad

అలాగే తనతో పాటుగా తెలుగు మార్కెట్ ని బాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ ఆలియా భట్ అదే రన్బీర్ భార్య కూడా కొంచెం సీరియస్ గానే తీసుకుంది అని చెప్పాలి. అలా తెలుగులో తన కొత్త చిత్రం "జిగ్ర" ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసింది. అయితే ఇది ఇంట్రెస్టింగ్ ఒక్క హిందీ మినహా కేవలం తెలుగులో మాత్రమే విడుదల చేస్తుండడంతో మన తెలుగు మార్కెట్ పట్ల ఎంత ఇష్టం ఉండి ఉండొచ్చు తనకి ఆదరణ దక్కుతుంది అనే నమ్ముతుంది అని చెప్పాలి.

కాగా ఈమె ఆల్రెడీ తెలుగులో భారీ చిత్రం RRR తో రామ్ చరణ్ సరసన సీతగా ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులు అందుకుంది. కాగా ఇప్పుడు జిగ్ర తో వస్తుంది కానీ ఈమె తెలుగు ఆడియెన్స్ అటెన్షన్ తెచ్చుకునే క్రమంలో బుక్కయ్యింది అని చెప్పాలి. రీసెంట్ గా జిగ్ర తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చేయగా అలియా కొంచెం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేయగా ఆమె మాటలు విని చాలా మంది ఆశ్చర్యపోయారు.

is alia bhatt cheated telugu Audience with Tele Promptor in jigra pre release in Hyderabad

కాగా ఇందులో అసలు గుట్టు ఏంటి అనేది రివీల్ అయ్యింది. కాగా ఆమె మాట్లాడుతున్నప్పుడు తన ముందు ఒక ఎల్ ఈ డి స్క్రీన్ లో స్పీచ్ కనిపిస్తుంది. దీనితో ఆలియా ఇలా మాట్లాడేశావా అంటూ సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ వైరల్ అవుతున్నాయి. సో ఇలా ఆలియా మన తెలుగు ఆడియెన్స్ ని చీట్ చేసింది అని చెప్పాలి.

అయితే ఇదేమి సీరియస్ గా కాదు కానీ ఫన్నీగానే వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రాన్ని వాసన్ బాలా దర్శకత్వం వహించగా ఈ సినిమా ఓ క్రేజీ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా అయితే తెరకెక్కించారు. అలాగే ఈ సినిమా ఈ దసరా కానుకగా ఈ అక్టోబర్ 11 న రిలీజ్ కి తీసుకొస్తున్నారు. మరి ఈ సినిమా తర్వాత సెన్సషనల్ యాక్షన్ ఫ్రాంచైజ్ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో సోలో సినిమా చేస్తుంది అని టాక్ కూడా ఉంది.

More from Filmibeat

Read more about: alia bhatt ramcharan jigra
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X