Janhvi Kapoor మాజీ ప్రియుడితో అనన్య పాండే డేటింగ్.. హాట్ టాపిక్‌గా అఫైర్ రూమర్లు!

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే డేటింగ్ వ్యవహారంపై బాలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. యువ హీరోతో అఫైర్ కొనసాగిస్తుందనే వార్తలు ఇటీవల కాలంలో మీడియాలో వినిపిస్తుండటం తెలిసిందే. అయితే అనన్య పాండే తన అఫైర్ గురించి ప్రస్తావించకుండా ఇటీవల గెహ్రాయియాన్ సినిమా ప్రమోషన్స్‌లో జాగ్రత్త పడింది. అయితే రోజు రోజుకు వార్తలు ఎక్కువ కావడంతో యువ హీరో తల్లి నీలిమా అజీమ్ రంగంలోకి దిగి.. తన కొడుకు అఫైర్ గురించి వివరణ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఖాలీ పీలీ సినిమా షూటింగులో

ఖాలీ పీలీ సినిమా షూటింగులో

ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న అనన్య పాండే 2020లో ఇషాన్ కట్టర్‌తో కలిసి ఖాలీ పీలీ సినిమాలో నటించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొన్నాయి. అయితే వారిద్దరి కలిసి డిన్నర్ డేట్స్‌కు వెళ్లడం, కలిసి చెట్టాపట్టాలేసుకొని కనిపించడంతో వారిద్దరి మధ్య డేటింగ్ ఉందనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.

ఇషాన్‌‌తో అనన్య విహార యాత్ర

ఇషాన్‌‌తో అనన్య విహార యాత్ర

అనన్య పాండే, ఇషాన్ కట్టార్ కలిసి ఇటీవల రాంథాంబర్ నేషనల్ పార్క్‌కు విహార యాత్రకు వెళ్లడంతో వారి అఫైర్ గురించి కన్ఫర్మ్ అయింది. వారిద్దరి కలిసి విహార పర్యటనను ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో ఓ రేంజ్‌లో అఫైర్ రూమర్లు ఊపందుకోవడంతో వారిద్దరి మధ్య సంబంధాన్ని ఇషాన్ తల్లి నీలిమా బయటపెట్టింది.

షాహిద్ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో

షాహిద్ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో

ఇటీవల జరిగిన హీరో షాహీద్ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో అనన్య పాండే పాలుపంచుకోవడంతో రూమర్లు తెగ ప్రచారం అయ్యాయి. దాంతో జాతీయ మీడియాతో నీలిమా అజీమ్ మాట్లాడుతూ.. వారిద్దరూ మంచి స్నేహితులు. ఒకరంటే మరొకరికి మంచి గౌరవం ఉంది. మా ఫ్యామిలీకి, అనన్య పాండే ఫ్యామిలీకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. షాహీద్, మీరా రాజ్‌పుత్‌తో అనన్యకు మంచి స్నేహం ఉంది. అలాగే ఇషాన్ లైఫ్‌లో ఆమె పాత్ర ముఖ్యమైంది. వారిద్దరి మంచి జోడి అని నీలిమా చెప్పింది.

అనన్య నటన హైలెట్ అంటూ

అనన్య నటన హైలెట్ అంటూ

అనన్య పాండే గురించి మాట్లాడుతూ.. ఆమె మంచి టాలెంటెడ్ నటి. షకున్ బాత్రా రూపొందించిన గెహ్రాయియాన్ సినిమాలో అనన్య నటన బాగుంది. దీపిక పదుకోన్‌తో కలిసి చక్కగా నటించింది. హీరోయిన్‌గా మరో స్థాయికి వెళ్లే ప్రతిభ ఆమెలో ఉంది. గెహ్రాయియాన్ సినిమాతో తానేంటో రుజువు చేసుకొన్నది. అనన్య పాండేపై క్రిటిక్స్ ప్రశంసలు కురిపించడంతో తాను చాలా సంతోషపడ్డాను అని నీలిమా చెప్పింది.

 విజయదేవరకొండతో కలిసి

విజయదేవరకొండతో కలిసి

ఇక అనన్య పాండే కెరీర్ విషయానికి వస్తే.. లాక్‌డౌన్‌లో ఓటీటీలో రిలీజైన ఖాళీపీలీ సినిమా తర్వాత ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనున్నది. అలాగే కత్రినా కైఫ్, సిద్దాంత్ కలిసి నటిస్తున్న ఫోన్ బూత్ చిత్రంలో కూడా నటిస్తున్నది. ఇంకా మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

Recommended Video

Hilarious Meme On Vijay Devarakonda Ananya Panday Viral Pic | Filmibeat Telugu
ఒడిదుడుకులతో ఇషాన్ కట్టర్ కెరీర్

ఒడిదుడుకులతో ఇషాన్ కట్టర్ కెరీర్

ఇక ఇషాన్ కట్టార్ విషయానికి వస్తే.. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌తో కలిసి ధడక్ అనే చిత్రంలో నటించాడు. ఆ తర్వాత పెద్దగా ఆయన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఖాళీ పీలి కూడా దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకొన్నది. ఇషాన్ ప్రముఖ హీరో షాహీద్ కపూర్‌కు సోదరుడు అనే విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X