Devara: దేవరలో జాన్వీ కపూర్‌కి టాప్ యాంకర్ డబ్బింగ్.. వర్కవుట్ అవుతుందా?
ప్రెజెంట్ టాలీవుడ్ సినిమా దగ్గర చాలా మంది కొత్త హీరోయిన్స్ ఉన్న సంగతి తెలిసిందే. నార్త్ సౌత్ అని తేడా లేకుండా టోటల్ ఇండియా వైడ్ గా హీరోయిన్స్ ఇప్పుడు మన తెలుగు సినిమా దగ్గరే కనిపిస్తున్నారు. ఇలా సౌత్ సినిమాకి ఎంట్రీ ఇచ్చేందుకు తహతహలాడుతున్న బాలీవుడ్ హీరోయిన్స్ లో హాట్ అండ్ బోల్డ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా ఒకామె చెప్పాలి.
కాగా అలనాటి నటి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లో పలు చిత్రాలు ఈమె చేసింది కానీ ఆమె కెరీర్ లో భారీ చిత్రం మొదలైంది మాత్రం మన తెలుగు సినిమా నుంచే అని చెప్పాలి. కాగా తన తల్లి శ్రీదేవి సీనియర్ ఎన్టీఆర్ తో నటిస్తే ఇప్పుడు జాన్వీ జూనియర్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకొని తెలుగు సినిమాలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది.

కాగా ఈమె తెలుగు సినిమాలో ఎంట్రీ ఇస్తూ చేసిన ఈ భారీ చిత్రమే "దేవర" కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఐతే ఇన్ని రోజులు జాన్వీ కపూర్ నుంచి మత్తెక్కించే అందాలు.. ఆమె ఆట పాట చూసారు కానీ ఇప్పుడు ఆమె మాట కూడా బయటకి వచ్చింది. కాగా తెలుగు ట్రైలర్ ని చూసిన వారు మాత్రం జాన్వీ కపూర్ కోసం మాట్లాడుకుంటున్నారు.
ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ ఉండగా ఇది జాన్వీ కపూర్ గొంతేనా అన్నంత నాచురల్ గా ఆ డబ్బింగ్ సింక్ అయ్యింది. ఇది బాగానే ఉంది కానీ చాలా మంది ఇది అంత పర్ఫెక్ట్ గా చెప్పింది ఎవరా అని అనుకుంటున్నారఋ. కానీ సరిగ్గా వింటే జాన్వీకి డబ్బింగ్ చెప్పింది ఎవరో అర్ధం అవుతుంది. మరి జాన్వీకి డబ్బింగ్ చెప్పింది ఎవరో కాదు మన తెలుగు సినిమా ప్రముఖ నటి అలాగే బుల్లితెర హాట్ అండ్ పాపులర్ యాంకర్ అనసూయ భరద్వాజ్ అట.
కాగా జాన్వీ వాయిస్ ని బాగా వింటే చాలా మంది అనసూయనే ఈమెకి డబ్బింగ్ చెప్పినట్టుగా అనిపించక మానదు. మరి ఒకవేళ ఇది జాన్వీకి తెలుగులో ఆమె సొంతంగా డబ్బింగ్ చెప్పుకునేవరకు అనసూయనే కొనసాగించినా ఎలాంటి లేదు అని చెప్పొచ్చు. అయితే ఒక నటిగా, యాంకర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా అనసూయ ఈ సినిమాకి మారింది అనుకుంటే పొరపాటే.

గతంలో మరో సినిమాకి కూడా అనసూయ తన డబ్బింగ్ ఇచ్చింది. మరి ఇలా దేవర విషయంలో మాత్రం ఇదొక సర్ప్రైజ్ అనే చెప్పి తీరాలి. కాగా ఈ భారీ సినిమాలో మరో బాలీవుడ్ ఆర్టిస్ట్ సైఫ్ అలీఖాన్ కూడా నటిస్తుండగా ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది అలాగే ఈ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పాన్ ఇండియా ముఖ్య భాషల్లో విడుదలకి రాబోతుంది. అలాగే ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











