44 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో ఎంజెలీనా.. ప్రియుడు ఎవరంటే!
హాలీవుడ్ నటి, అందాల తార ఎంజెలీనా జోలి మరోసారి ప్రేమలో పడినట్టు వార్తలు వస్తున్నాయి. నటుడు, భర్త బ్రాడ్ పిట్‌తో విడాకులు పొందిన తర్వాత తన ఆరోగ్యం, పిల్లలపై దృష్టిపెట్టింది. మరొకరితో రిలేషన్ పెట్టుకోవద్దని భావించిన ఈ బ్యూటీ ఊహించని విధంగా హాలీవుడ్ హీరో, జాన్ విక్ 3 కీన్యూ రీవ్స్‌తో డేటింగ్ చేస్తుండటం చర్చనీయాంశమైంది.
వచ్చేనెల 44 ఏళ్ల వయసులోకి ప్రవేశిస్తున్న ఎంజెలీనా జోలి.. కీన్యూతో అతిసన్నిహితంగా ఉంటున్నట్టు హాలీవుడ్ పత్రికల కథనం. ఎంజెలీనా పుట్టిన రోజు కోసం రీవ్స్ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో తన పుట్టిన రోజు జీవితంలో మధుర సంఘటనగా మిగిలిపోతుందని పలు కథనాలు బయటకు వచ్చాయి.

బ్రాడ్ పిట్‌తో విడాకుల తర్వాత ఈ పుట్టిన రోజు ఆమె జీవితంలో ఓ టర్నింగ్ పాయింట్‌గా మారబోతున్నది. కొత్త బంధం ఆమె జీవితంలో ఆనందం, వెలుగు నింపుతుంది అని కథనాల్లో పేర్కొంటున్నారు.
2017లో లాస్ ఎంజెలెస్‌లో కీన్యూ రీవ్స్, ఎంజెలీనాలు కలుసుకొన్నారు. తన తల్లిని కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఎంజెలీనాతో దగ్గరయ్యాడు. కీన్యూ తల్లి కూడా వారి ప్రేమకు సపోర్ట్ చేస్తుంది. కీన్యూ త్వరగా జీవితంలో సెటిల్ అయితే చూడాలని ఉందనే కోరికను బయటపెట్టింది అని పత్రికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఎంజెలీనా జోలి ది ఎటర్నల్స్ అనే చిత్రంలో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











