Anupama Parameswaran ఎంగేజ్‌మెంట్? నిశ్చితార్థం ఎవరితో అంటే? సోషల్ మీడియా పోస్టు వైరల్!

దక్షిణాదిలో విభిన్నమైన పాత్రలు, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకొన్న వారిలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ప్రేమమ్ సినిమాతో సౌత్ ప్రేక్షకులకు దగ్గరనైన ఈ అందాల భామకు ప్రొఫెషనల్‌గా దూసుకెళ్తున్నది. అయితే ఈమె వ్యక్తిగత జీవితానికి వస్తే.. అఫైర్లు, డేటింగ్ వార్తలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. ఈ క్రమంలో తన ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. ఆ పోస్టు వెనుక కథ ఏమిటంటే?

అనుపమ పరమేశ్వరన్ నటించిన చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. ఇటీవల రిలీజైన కార్తీకేయ 2 సినిమాతో పాన్ ఇండియా అప్పీల్ సొంతం చేసుకొన్నది. కార్తీకేయ 2 సినిమాతో స్టార్ స్టేటస్‌ను పెంచుకొని విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.

Anupama Parameswaran

ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ స్టార్ హీరోలతో జత కడుతూ విభిన్నమైన చిత్రాల్లో నటిస్తున్నది. ధనుష్‌తో కలిసి కోడి, అథర్వతో కలిసి తల్లి పొగాతే లాంటి చిత్రాల్లో నటిస్తున్నది. అంతేకాకుండా కీర్తీ సురేష్, జయం రవి కాంబినేషన్‌లో వస్తున్న సైరన్ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నది. ఇంకా మలయాళం, తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు.

ఇలా కెరీర్ పరంగా ఓ రేంజ్‌లో ఉన్న అనుపమ పరమేశ్వరన్.. ఇన్స్‌టాగ్రామ్‌లో నా ఎంగేజ్‌మెంట్ అయిందని.. చేతికి ఓ కంకణం కట్టుకొని ఫోటో పెట్టింది. అలాగే ఎంగేజ్ అంటూ మెసేజ్ పెట్టి.. నవ్వుతూ ఉన్న ఇమోజీని పెట్టింది. దాంతో ఆమె అభిమానులు నిజమేనా అంటూ ఆమె పోస్టు కింద కామెంట్లు పెడుతున్నారు. అలాగే కొందరు శ్రేయోభిలాషులు కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు.

Anupama Parameswaran

అయితే గతంలో క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే బూమ్రా ఇటీవల తన గర్ల్‌ఫ్రెండ్‌ సంజనాను వివాహం చేసుకోవడంతో ఆమె ఆఫైర్ వార్తలకు బ్రేకులు పడ్డాయి.అయితే ఆమె ఎంగేజ్ మెంట్ జరిగిన మిస్టరీ మ్యాన్ ఎవరు అనే ప్రశ్న ప్రస్తుతం అభిమానులను వెంటాడుతున్నది. తన ఎంగేజ్‌మెంట్ వార్త నిజమా? లేక ఆటపట్టించడానికి అనుపమ చేసిన చిలిపి ప్రయత్నమా? అనే కొద్ది రోజులు ఆగితే.. తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X