twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుష్క శర్మ ప్రెగ్నెంట్.. పెదవి విప్పని విరాట్.. ఆధారాలతో సహా ఫొటోలు అంటూ!

    |

    బాలీవుడ్ నటి అనుష్క శర్మ గర్భం దాల్చిందనే చర్చ సోషల్ మీడియా, బాలీవుడ్ మీడియాలో మొదలైంది. భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో అనుష్క వివాహం జరిగి ఏడాది పూర్తి కావొస్తున్నది. డిసెంబర్ 11న ఇటలీలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే అనుష్క శర్మ జీరో సినిమా తర్వాత ఏ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఈ అనుమానాలు జోరందుకొన్నాయి. వివరాల్లోకి వెళితే..

     ట్రెండింగ్‌గా అనుష్క ప్రెగ్రెన్సీ వార్త

    ట్రెండింగ్‌గా అనుష్క ప్రెగ్రెన్సీ వార్త

    అందాల భామ అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అనే వార్తలు రోజు రోజుకు బలంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో ఫొటోలు పబ్లిష్ చేస్తూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. అనుష్క పొట్ట బయటకు వచ్చి ఉండటం కూడా అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.

    పెదవి విప్పని విరాట్ కోహ్లీ

    పెదవి విప్పని విరాట్ కోహ్లీ

    అయితే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ నుంచి అధికార ప్రకటన రాకపోవడంతో రూమర్లు అనే మాట కూడా వినిపిస్తున్నది. అయితే సూయి ధాగా తర్వాత జీరో చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత ఏ సినిమాను ఒప్పుకోకపోవడంతో అనుష్క శర్మ గర్బవతి అని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.

    అనుష్క-విరాట్ రిలేషన్లో స్పెషల్ మైల్‌స్టోన్... అదే ఊపులో బ్రహ్మాండం బద్దలవుతుందా?అనుష్క-విరాట్ రిలేషన్లో స్పెషల్ మైల్‌స్టోన్... అదే ఊపులో బ్రహ్మాండం బద్దలవుతుందా?

    అనుష్కశర్మకు గర్భస్రావం

    అనుష్కశర్మకు గర్భస్రావం

    అనుష్క శర్మ ప్రెగ్నెన్సీపై మరో వాదన కూడా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఆమెకు గర్భస్రావం జరిగింది. అందుకే సినిమాలకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకొంటున్నదనే మరో మాట కూడా మీడియాలో వినిపిస్తున్నది. ఆమె కొంత అనారోగ్యంతో బాధపడుతుండటం కారణంగా సినిమాలకు దూరంగా ఉంది అని చెప్పుకొంటున్నారు.

    అస్ట్రేలియాలో తొలి వివాహ వార్షికోత్సవం

    అస్ట్రేలియాలో తొలి వివాహ వార్షికోత్సవం

    ఇదిలా ఉండగా, తమ తొలి వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి విరాట్, అనుష్క దంపతులు ప్లాన్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో భారత్-ఆసిస్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్‌లో జరుగనున్నది. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా సభ్యులతో కలిసి అనుష్క-విరాట్ తమ పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉందనే విషయం మీడియాలో ప్రచారం అవుతున్నది.

    English summary
    Bollywood diva Anushka Sharma does not have any other upcoming movie than Zero made people further wonder if pregnancy is the reason behind she not signing any other film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X