అనుష్క శెట్టిపై మరో రూమర్.. ఇక చివరి అస్త్రం అదేనట!
అందం, అభినయంతో మెప్పిస్తున్న అనుష్క శెట్టి గురించి రూమర్లు యదేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి. బాహుబలి తర్వాత అనుష్క వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలు పెరిగిపోయాయి. దర్శకుడు అశోక్ రూపొందించిన భాగమతి చిత్రం తర్వాత సినిమాలు అంగీకరించకపోవడంతో రూమర్లు జోరు పెరిగింది. తాజాగా అనుష్కపై జాతీయ ఆంగ్ల మీడియాలో వచ్చిన వార్త ఏమిటంటే..

జోరుగా అనుష్క పెళ్లి వార్తలు
బాహుబలి తర్వాత అనుష్క పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తన పెళ్లి గురించి వస్తున్నవార్తలను అవును.. కాదు అని చెప్పకుండా దాటవేశారు. ఇటీవల కాలంలో అనుష్క కుటుంబం ఆమెకు పెళ్లి సంబంధాలు ఎక్కువగానే చూస్తున్నారట.

కేదార్‌నాథ్‌లో అనుష్క పూజలు
అనుష్క వ్యక్తిగత జీవితంపై గ్రహాల ప్రభావంతో కొన్ని దోషాలు ఉండటంతో ఇటీవల కేదారినాథ్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాకుండా కర్ణాటకలో కూడా ఓ ప్రముఖ దేవాలయంలో కూడా కుటుంబ సభ్యులతో కలిసి పూజల్లో పాల్గొన్నట్టు వార్తలు వచ్చాయి. ఇవన్నీ ఆమె పెళ్లి కోసమే అనే మాట వినిపించింది.

కోన వెంకట్ సైలెన్స్ మూవీలో
ఇలాంటి రూమర్ల మధ్య చాలా రోజుల తర్వాత నిర్మాత, రచయిత కోన వెంకట్ రూపొందించబోయే సైలెన్స్ అనే చిత్రంలో నటించడానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో ఉంటుంది. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్‌తో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మైఖేల్ విలన్‌గా కనిపిస్తారట.

సినిమా రంగానికి గుడ్‌బై
అనుష్కపై రూమర్లలో తాజాగా వచ్చిన అసలు విషయం ఏమిటంటే.. సైలెన్స్ సినిమా తర్వాత సినీ రంగానికి, నటనకు గుడ్ బై చెప్పబోతున్నారట. 2020లో ఈ నిర్ణయం తీసుకొంటారట. అందుకే సినిమాలు కమిట్ కావడం లేదుట. తాను బరువు తగ్గడానికి విదేశాల్లో ప్రత్యేకమైన శిక్షణ పొందుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











