టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం.. నిర్మాత అరెస్ట్.. డ్రగ్స్ కేసులో అషురెడ్డి పేరు లీక్?
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కలకలం సంచలనం రేపింది. హైదరాబాద్ పోలీసులకు చిక్కిన డ్రగ్స్ డీలర్ కేపీ చౌదరీని విచారించగా సినీ తారల భాగోతం బయటపడింది. టాలీవుడ్‌ను డ్రగ్స్ ప్రకంపనలు మరోసారి వణికిస్తున్నాయి. పోలీసుల విచారణలో భారీగా సినీ తారల పేర్లు బయటకు వస్తున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలో డ్రగ్స్ కలకలం వివరాల్లోకి వెళితే..
కేపీ చౌదరీ విషయానికి వస్తే.. తెలుగు సినిమా పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్‌గా సుపరిచితులు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సర్దార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం లాంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. సినీరంగంలో భారీగా నష్టపోవడంతో గోవాకు వెళ్లి నైట్ క్లబ్‌ను నిర్వహిస్తున్నారు. ఈయనకు పలువురు సినీ తారలతో మంచి పరిచయాలు ఉన్నాయి.

డ్రగ్స్ దందాలో కబాలి తెలుగు డబ్బింగ్ నిర్మాత సుంకరి కృష్ణ ప్రసాద్ చౌదరీ అలియాస్ కేపీ చౌదరీని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. గత మూడు రోజులుగా పోలీసులు విచారించగా పలువురు సినీ తారలు, బిజినెస్ మ్యాన్లు, ఇతర ప్రముఖుల పేర్లు బయటకు వచ్చినట్టు తెలుస్తున్నది. కేపీ చౌదరీతోపాటు నైజీరియాకు చెందిన గ్యాబ్రియల్ కూడా అరెస్ట్ కావడం, అతడి వద్ద 110 గ్రాములకుపైగా కొకైన్ లభించిన విషయం తెలిసిందే.
కేపీ చౌదరీని విచారించిన క్రమంలో టాలీవుడ్‌కు డ్రగ్స్ దందాతో సంబంధం మరోసారి బయటకు వచ్చింది. కేపీ చౌదరీ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొన్నారు. అందులో ఛాటింగ్, ఫోన్ కాల్ డేటాను బయటకు తీయడంతో సంచలన విషయాలు బయటపడ్డాయి. కాల్ డేటా ఆధారంగా పలువురు సినీ తారలను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు.
తాజా కేపీ చౌదరీ డ్రగ్స్ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు అషురెడ్డి. కేపీ చౌదరీని మొబైల్ ఫోన్ కాల్ లిస్టులో అషురెడ్డి పేరు కనిపించినట్టు సమాచారం. పలుమార్లు ఆమెతో ఫోన్‌లో మాట్లాడినట్టు ప్రధాన మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. టెలివిజన్, బిగ్‌బాస్ తెలుగు షో ద్వారా మరింత పాపులర్ అయ్యారు. రాంగోపాల్ వర్మతో శృంగారపరమైన ఇంటర్వ్యూతో ఆమెకు మరింత ఫాలోయింగ్ పెరిగింది. అయితే అషురెడ్డితోపాటు పలువురు సినీ, రాజకీయ నేతల కుమారులు కూడా ఉన్నట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











