నాగిని సీరియల్ హీరోయిన్ కు అక్కడ సర్జరీ.. భయాందోళన
బాలీవుడ్ నటి మౌనీరాయ్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరనే. ఎలాగంటలే ఆమె హిందీలో డైలీ సిరీయల్ 'నాగిని'లో నటించి మెప్పించింది. ఆ సిరీయల్ తెలుగులోనూ ప్రసారమైంది. నాగినిగా మౌనీరాయ్ అద్భుతమైన పెర్ఫామెన్స్ చూపించింది. ఆ ఒక్క సీరియల్ తో ఆమెకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. టెలివిజన్ యాక్ట్రెస్ గా హయ్యేస్ట్ పేయిడ్ అందుకుందీ మౌనీ రాయ్. నాగిని, నాగిన్ 2 సీరియల్స్ తో బుల్లితెర స్టార్ గా వెలుగొంది. 2015 నుంచి 2017 మధ్యలో ఊపూపింది. తన నటనకు ఫిల్మ్ ఫెయిర్, ఐఫా అవార్డ్ లను కూడా సొంతం చేసుకుంది.
పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. పలు పాత్రలతో ఆకట్టుకుంది. ముఖ్యంగా స్పెషల్ డాన్స్ తో నార్త్ ఆడియెన్స్ కు గ్లామర్ టేస్ట్ చూపించి అదరగొట్టింది. మాస్ ఆడియెన్స్ ను తన అభిమానులుగా మార్చుకుంది. డ్యాన్స్ స్కిల్స్ తో వెండితెరపై మరికొన్నాళ్లు వెలుగొంది. ప్రస్తుతం మాత్రం అటు సాంగ్స్, ఇటు సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖ్యంగా తను నెగెటివ్ పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచింది. ఆ దిశగానే కెరీర్ ను సాగిస్తోంది. అయితే మౌనీరాయ్ గురించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. దాంతో అభిమానులు భయాందోళనకు గురవుతున్నారు.

మౌనీరాయ్ వెండితెరపై మెరుస్తూనే తన అభిమానులకు మాత్రం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం మౌనీరాయ్ హిందీ భాషలో బాలీవుడ్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న 'ది భూత్ని' అనే చిత్రంలో నటించింది. ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ప్రచార కార్యక్రమాలను ముందుగానే ప్రారంభించింది యూనిట్. అయితే తాజాగా జరిగిన మూవీ ప్రమోషనల్ ఈవెంట్ లో మౌనిరాయ్ కూడా పాల్గొన్నారు. దాంతో ఆమె వార్తల్లో నిలిచింది.
అయితే, మౌనీరాయ్ సోషల్ మీడియాలో తరుచూగా తన అందమైన ఫొటోలను పంచుకుంటూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు బ్యూటీఫుల్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తూనే వస్తోంది. కాగా, తాజాగా డైరెక్ట్ గా దర్శనమిచ్చి షాకిచ్చింది. బ్యూటీఫుల్ శారీలో మెరిసి ఆకట్టుకున్నప్పటికీ.. ఆమె ఫేస్ మాత్రం షాకిచ్చేలా ఉంది. మౌనీరాయ్ నుదిట లొంతలు పడి కనిపించింది. దాంతో ఆమె లుక్ కాస్తా దెబ్బతినింది. అయితే గతంలో పలు సర్జరీల కారణంగానే ఆమె ఫేస్ దెబ్బతినిందని ఇప్పుడు చూసిన నెట్టిజన్లు అభిప్రాయపడుతున్నారు.
కాగా, మౌనీరాయ్ మళ్లీ ఫేస్ సర్జరీ చేయించుకుందా? అని కూడా సందేహిస్తున్నారు. ఏదేమైనా ఆమెను అభిమానించే వారు మౌనీరాయ్ నుదిటన అలాంటి బొడుసు చూసి కంగారు పడుతున్నారు. తమ ఫేవరేట్ యాక్ట్రెస్ కు ఏమై ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. ఇక మౌనీరాయ్ సరిగా నవ్వలేకపోవడం, కనుబొమ్మలను కదిలించలేకపోవడం చూసి అభిమానులు షాక్ అయ్యారు. దీనిపై అభిమానులకు మౌనీరాయ్ ఎలా సమాధానం ఇస్తుందో చూడాలి. ఇక హారర్ర్ ఫిల్మ్ 'భూత్ని' చిత్రం ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది. సంజయ్ దత్ ప్రధాన పాత్ర పోషించారు. మౌనీరాయ్ నెగెటివ్ పాత్రలో మరోసారి అలరించబోతోంది.
Mouni Roy's Trailer Launch Event Happening Today! ❤️#MouniRoy #TrailerLaunch #EventDay #BollywoodBeauty #glamqueen pic.twitter.com/GjIqNnxG5K
— Funkaar Media (@funkaar_media) March 29, 2025


Click it and Unblock the Notifications











