బొమ్మరిల్లు బ్యూటీ జెనీలియాకు చేదు అనుభవం
టాలీవుడ్ సినిమా దగ్గర అతి తక్కువ కాలంలో మంచి ముద్ర వేసుకున్న హీరోయిన్ కొందరే కనిపిస్తారు. మరీ స్టార్ట్ హీరోయిన్స్ రేంజ్ లో కాకపోయినా వరుస అవకాశాలు పెద్ద హీరోస్ తో కూడా నటించే ఛాన్స్ లని కొట్టేసిన బ్యూటీస్ గా కొందరు కనిపిస్తారు. ఇంకా ఇంట్రెస్టింగ్ గా అలాంటి వారిలో స్కిన్ షో లాంటివి కూడా లేకుండా ఉన్నవారు లేకపోలేరు.
కాగా ఇలా తెలుగు సినిమా దగ్గర తక్కువ కాలంలోనే మంచి ముద్ర వేసుకున్న అప్పటి జెనరేషన్ హీరోయిన్స్ లో జెనీలియా అంటే తెలియని వారు ఎవరూ ఉండకపోవచ్చు. మెయిన్ గా బొమ్మరిల్లు హాసినిగా జెనీలియా ఒక గుర్తుండిపోయే పాత్ర తెలుగు ఆడియెన్స్ కి అందించింది. కాగా తెలుగులో వరుస సినిమాలు అంతే కాకుండా వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ని జెనీలియా అందుకోవడం విశేషం.

ఇలా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ఆరెంజ్ అనే సినిమా చేసి అక్కడితో తెలుగు సినిమాకి దాదాపు స్వస్తి చెప్పేసింది. కాగా ఆ సినిమా హిట్ అయ్యి ఉంటే మరిన్ని అవకాశాలు వచ్చి ఉండేవి ఏమో కానీ అదే సినిమా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ అని ఓకే చేసిందో ఏమో కానీ బొమ్మరిల్లు చిత్రంలో ఎంతో అలరించిన ఈమె ఆరెంజ్ సినిమాలో అప్పటి ఆడియెన్స్ మైండ్ సెట్ ని అంతే ఇరిటేట్ కూడా చేసింది.
కాగా ఇపుడు ఈ సినిమా క్లాసిక్ అయ్యింది అది మరో విషయం కానీ ఆ సినిమా తర్వాత దాదాపు తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా హిందీలో కూడా సినిమాలు జెనీలియా వదిలేసింది. అలా కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సినిమాల్లోకి వద్దాం అనుకునే సమయంలో మాత్రం ఆమె ఎమోషనల్ గా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా తెలిపింది.
కాగా తాను గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వెళదాం అనే సమయంలో తనని తన చుట్టూ ఉన్నవాళ్లే ఎంతో ఇబ్బంది పెట్టారట. ఎందుకు మళ్ళీ సినిమాలు అని దాదాపు అంతా తనని వద్దనే నిరాశపరిచే వారు అని ఆమె చెప్పుకొచ్చింది. తనకి బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకున్నాక వారికి పిల్లలు పుట్టిన తర్వాత ఇదంతా తన లైఫ్ లో జరిగిందట.
పదేళ్ల తర్వాత సినిమాల్లోకి వస్తున్నావ్ ఇదంతా నీకు వర్కౌట్ అవ్వదు అనే చాలా మంది హేళన చేసేవారు అని జెనీలియా తెలిపింది. ఇక ఫైనల్ గా అవన్నీ పక్కన పెట్టి డేర్ చేసి ఫీమేల్ లీడ్ లో చేసానని తెలిపింది. కాగా ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత తన భర్త తోనే 'వేద్' అనే సినిమాలో జెనీలియా నటించి హిట్ కొట్టి హిందీలో మంచి కంబ్యాక్ ఇచ్చింది.
అన్నట్టు ఈ చిత్రం కూడా ఏదో కాదు తెలుగులో మాజీ భార్య భర్తలు సమంత, నాగ చైతన్య నటించిన భారీ హిట్ చిత్రం 'మజిలీ'కి రీమేక్ గా తన భర్తతో చేసి మరీ జెనీలియా హిట్ కొట్టింది. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ సినిమాల్లో ఆమె బిజీగా మారగా ప్రస్తుతం తెలుగులో కూడా ఒక సినిమా చేస్తున్నట్టుగా భోగట్టా.


Click it and Unblock the Notifications











