ఆ క్రికెటర్ దారుణంగా చీటింగ్ ఛేశాడు.. షాకింగ్‌గా తెలుగు హీరోయిన్ సోషల్ మీడియా పోస్ట్

సెలబ్రిటీల జీవితాల్లో సాధారణంగా పెళ్లి తర్వాత లేదా బ్రేకప్ తర్వాత ఒకరిపై మరొకరు వ్యక్తిగతంగా ఆరోపణలు చేసుకోవడం కనిపిస్తుంటుంది. కానీ తాజాగా యువ నటి, క్రికెటర్ మధ్య పెళ్లికి ముందే చీటింగ్ చేశాడు.. మోసగాడు అనే కామెంట్స్ బయటకు రావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆ క్రికెటర్ పృథ్వీ షా కాగా, ఆ యువ నటి ఆకృతి అగర్వాల్ కావడం మరింత సెన్సేషనల్‌గా మారింది. ఇంతకు యువ నటి నర్మగర్భంగా చేసిన ఆరోపణల వెనుక వాస్తవం ఏమిటి? ఎంగేజ్‌మెంట్ అయిన మూడు నెలలకే వారి మధ్య వివాదం ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

ఆకృతి అగర్వాల్ విషయానికి వస్తే.. ఇటీవల విడుదలైన త్రిముఖ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ సినిమాకు దర్శకుడిగా రాజేశ్ నాయుడు వ్యవహరించారు. ఈ సినిమాను అఖీరా డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీదేవీ, రమేష్ మద్దాలి నిర్మించారు. ఈ చిత్రంలో సన్నీలియోన్, సుమన్, రాజేంద్రన్ తదితరులు నటించారు.

Akriti Agarwal allegation on Cricketer Prithvi Shah

ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకొంటున్న ఆకృతికి, క్రికెటర్ పృథ్వీషా ఇద్దరు కొన్ని నెలల క్రితం ప్రేమలో పడ్డారు. వారి ప్రేమ వ్యవహారం పీక్స్ చేరడంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. ఇరు కుటుంబాల సమ్మతితో వారిద్దరూ పెళ్లికి సిద్దమయ్యారు. ఈ మేరకు వారిద్దరు మార్చి 2026 లో ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాన్ని ఘనంగా చేసుకొన్నారు. ఇక పెళ్లికి బాజాలు సిద్దమవుతున్న సమయంలో వారిద్దరి మధ్య ఎదో తెలియని విధంగా విభేదాలు చోటు చేసుకోవడం, అవి తారాస్థాయికి చేరడం జరిగింది.

తాజాగా పృథ్వీ షాతో రిలేషన్‌షిప్ బెడిసికొట్టిందనే విధంగా ఆకృతి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టడం ట్రెండింగ్‌గా మారింది. తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో స్టోరీ రూపంలో ఓ పోస్టు పెట్టి.. నేను చాలాసార్లు చీటింగ్‌కు గురయ్యాను. కానీ ఏ రోజు కూడా ఒక్క మాట కూడా బయటకు చెప్పలేదు. అయితే జీవితంలో ఓ అడుగు ముందుకు వేసేందుకు నిర్ణయం తీసుకొన్న తర్వాత.. కొన్ని విషయాలను నమ్మలేకపోతున్నాను అని తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు.

అంతటితో ఆగకుండా ఆమె మరో కామెంట్ చేస్తూ.. ప్రతీ విషయం నిజమే. ప్రతీ రూమర్‌లో వాస్తవం ఉంది. సోషల్ మీడియాలో అతడి గురించి వచ్చే రూమర్లన్నీ నిజాలే అంటూ నర్మగర్భంగా కామెంట్ చేసింది. అయితే ఈ పోస్టులో ఎక్కడా కూడా పృథ్వీ షా పేరు ఎత్తకపోవడం భారీగా కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత మరో పోస్టులో అందరూ అపార్థం చేసుకొన్నారు అంటూ మరో క్రిప్టిక్ మెసేజ్ పోస్టు చేసింది. దాంతో ఇంతకు ఆకృతి ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నదనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Akriti Agarwal allegation on Cricketer Prithvi Shah

అయితే ఇలాంటి వివాదం మధ్య ఆకృతి, పృథ్వీ షా ఇద్దరు కూడా సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. వారిద్దరూ అన్ ఫాలో కాకపోవడం కూడా అనేక సందేహాలను క్రియేట్ చేస్తున్నాయి. ఇంతకు ఆమె చేస్తున్న ఆరోపణలు పృథ్వీ షా పైనేనా అనే అనుమానం వచ్చినప్పటికీ.. తన పోస్టులో ఆమె హార్ట్ బ్రేక్ పెట్టడం వల్ల పక్కాగా కాబోయే భర్త గురించే అని కొందరు తమకు తాము ఊహించుకొంటున్నారు. ఆకృతి ఈ విషయంపై క్లారిటీ ఇస్తే గానీ.. అసలు విషయం బయటపడదని అని నెటిజన్ల అనుకొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X