స్పిరిట్ నుంచి దీపిక పదుకోన్ అవుట్? అన్ని కోట్లు డిమాండ్ చేసిందా? క్రిటిక్స్ వివాదాస్పద పోస్ట్
రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో రానున్న స్పిరిట్ షూటింగ్ ప్రారంభానికి ముందే సంచలన వార్తలకు వేదికగా మారింది. టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ నిర్మాతగా ఈ సినిమాను రూపొందించే పనిలో ఉన్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన నటీనటులు ఎంపిక ప్రాసెస్ జోరందుకొన్నది. అయితే ప్రభాస్ పక్కన నటించే హీరోయిన్ ఎవరనే విషయం ఆసక్తిగా మారింది. అయితే ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ విషయంలో ఓ రూమర్ వైరల్ అవుతున్నది. ఈ రూమర్ వివరాల్లోకి వెళితే..
స్పిరిట్ సినిమా ఇంకా స్క్రిప్టు దశలోనే ఉండగానే ఈ మూవీపై ఊహకు అందని విధంగా క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కరీనా కపూర్ పేరు తొలిసారి తెరపైకి వచ్చింది. అయితే ఆమె తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పడంతో ఆ వార్తలో నిజం లేదని క్లారిటీ వచ్చేసింది. ఆ తర్వాత కల్కి చిత్రంలో కీలక పాత్రలో కనిపించిన దీపిక పదుకొన్ పేరు హీరోయిన్ అంటూ బలంగా వినిపించింది. అయితే దాదాపు ఆమె నటించడం కన్ఫర్మ్ అయిందనే విషయంపై ధృవీకరించే సమయంలో ఆమెను ఈ సినిమా నుంచి తొలగించారనే వార్త బాంబులా పేలింది.

స్పిరిట్ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం దీపిక పదుకోన్‌తో చర్చలు జరుగుతున్నాయనే వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి. అయితే స్పిరిట్ బోర్డు మీదకు దీపిక పదుకోన్ రావడం ఖాయమనే టైమ్‌లో ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. మరో హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టారనే విషయం హిందీ సినిమా పరిశ్రమలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా బ్రేకింగ్ అయింది.
అయితే దీపిక పదుకోన్‌ను స్పిరిట్ నుంచి తీసేశారు అనే విషయం బాలీవుడ్‌లో ప్రముఖ వివాదస్పద క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ సెన్సేషన్ ట్వీట్ చేశారు. సందీప్ రెడ్డి, ప్రభాస్ సినిమా నుంచి దీపిక పదుకోన్ అవుట్ అయింది. ఆమె కోరిన గొంతెమ్మ కోరికలకు, డిమాండ్లకు టీమ్ షాక్ తిన్నది. తన రెమ్యునరేషన్‌గా 30 కోట్ల రూపాయలు చెల్లించాలి. అదనంగా జీఎస్టీ కూడా చెల్లించాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా రోజుకు 8 గంటల షిష్ట్ కాకుండా కేవలం 6 గంటలకే పనిచేస్తానని చెప్పింది. అందుకే ఆమెను ఈ సినిమా కోసం తీసుకోకూడదనే నిర్ణయానికి వచ్చారు అని కేఆర్కే తన ట్వీట్‌లో తెలిపారు.
అంతేకాకుండా షూటింగ్ సమయంలో తెలుగు వెర్షన్ చిత్రీకరణ సమయంలో తెలుగు డైలాగ్స్ పలకను అని చెప్పారు. అలాగే మొత్తంగా 26 మంది స్టాఫ్ తనతో ఉంటారు. వారికి సంబంధించిన జీతాలు, భత్యాలు నిర్మాతనే చూసుకోవాలి అనే డిమాండ్ క్లియర్‌గా పెట్టారు. దాంతో సందీప్ రెడ్డి వంగ మీరు మాకు అవసరం లేదని చెప్పారు. దాంతో ఆమెను ఈ సినిమా నుంచి తప్పించారు అని కేఆర్కే తన ట్వీట్‌లో తెలిపారు.
ఇదిలా ఉండగా, దీపిక పదుకోన్ గురించి దుబాయ్ క్రిటిక్ ఉమేర్ సంధూ కూడా ట్వీట్ చేశాడు. స్పిరిట్ సినిమా కోసం ఆమె 50 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా డిమాండ్ చేసింది. అయితే నిర్మాతలు, డైరెక్టర్ ఆమె కోరిన మొత్తాన్ని చెల్లించడానికి నిరాకరించారు. అయినా వయసు పైపడిన క్వీన్ ఈ సినిమాలో అవసరమా? ఆమె ఓవర్ రేటేడ్ యాక్టర్. అగ్లీ యాక్టర్.. యాక్ అంటూ దారుణంగా ఉమేర్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











