రూట్ మార్చిన దీపిక పదుకోన్.. తల్లి కాబోతున్న టైమ్‌లో..!

సాధారణంగా హీరోయిన్లు పెళ్లి పిల్లలు పుట్టాక పెద్దగా అవకాశాలు రావట్లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ అవకాశాలు వచ్చినా హీరోయిన్ గా కాకుండా సపోర్టింగ్ రోల్ లేదా కీ రోల్ కోసమే మ్యారీడ్ హీరోయిన్లను సంప్రదిస్తుంటారు మేకర్స్. తాజాగా తల్లి కాబోతున్న హీరోయిన్‌ దీపికకు పెళ్ళైనప్పటి నుంచే తల్లి పాత్రల చేసే ఆఫర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఆమెకు కూడా తప్పడం లేదు. ప్రస్తుతం దీపిక పదుకోన్ చేస్తున్న పాత్రలపై ఓ లుక్కేద్దాం పదండి.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము. ఆమె విషయంలో మాత్రం ఇదంతా రివర్స్ గేర్ లో జరుగుతుంది. పెళ్లయ్యాక కూడా బికినీలో సెగలు పుట్టించి ఈ బ్యూటీ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆమె చేస్తున్న పత్రాలు మాత్రం కొత్త అనుమానాలకు తెర తీస్తున్నాయి.

Is Deepika Padukone showing interest on Performance roles after Kalki 2898 AD

దీపికా పదుకొనే త్వరలోనే తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె తన భర్త రణ్‌వీర్ సింగ్ తో కలిసి కొన్నాళ్ల క్రితమే బయట పెట్టింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆమె బేబీ బంప్ గురించే చర్చ నడుస్తోంది. ఇక తాజాగా దీపికా ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడి ట్రైలర్ రిలీజ్ కాగా, సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే ఈ ట్రైలర్ లో దీపికా పదుకొనే పాత్ర చూశాక ఇక ఈమె భవిష్యత్తు ఇంతేనా అనే అనుమానం రాకమానదు అభిమానులకు.

ఎందుకంటే త్వరలోనే తల్లి కాబోతున్న దీపికా పదుకొనే పాన్ ఇండియా మూవీ కల్కిలో కూడా తల్లి కాబోతున్న మహిళ పాత్రలోనే నటించింది. ఆమె ఇలాంటి పాత్రలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల కాలంలో ముఖ్యంగా పెళ్లి అయ్యాక దీపిక పదుకొనేకు వరుసగా ఇలాంటి పాత్రలే వస్తున్నాయి. మొట్టమొదటిసారి బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ లో రణబీర్ తల్లిగా నటించింది దీపిక.

Is Deepika Padukone showing interest on Performance roles after Kalki 2898 AD

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అగ్నిని తట్టుకునే ప్రత్యేకమైన శక్తితో హీరోకు దీపిక జన్మనిస్తుంది. ఇక ఆ తర్వాత గతేడాది రిలీజ్ అయిన జవాన్ సినిమాలో కూడా అచ్చం ఇలాంటి పాత్రనే పోషించింది దీపిక. అట్లీ దర్శకత్వంలో షారుక్ హీరోగా నటించిన ఈ సినిమాలో దీపికా పదుకొనే కెప్టెన్ విక్రమ్ రాథోడ్ పాత్రలో మెరిసిన షారుక్ కు జంటగా నటించింది. సినిమాలో ఈ దంపతులకు ఆజాద్ అనే కొడుకు పుడతాడు.

దీపిక ఆజాద్ తల్లి ఐశ్వర్య పాత్రలో నటించింది. ఇక షారుఖ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ముచ్చటగా మూడోసారి దీపికా పదుకొనే తల్లి పాత్రలో నటించడం విశేషం. కల్కి మూవీలో గర్భవతిగా ఉన్న అమ్మాయిగా దీపిక నటిస్తోందని ట్రైలర్ లో చూపించారు. ఇక ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఆమె బిడ్డకు జన్మనిచ్చాక ఎలాంటి పాత్రలు వస్తాయో అనేది హాట్ టాపిక్ గా మారింది. పెళ్లయ్యాక విపరీతంగా గ్లామర్ వలకబోసిన ఈ బ్యూటీ బిడ్డ పుట్టాక అసలు సినిమాలో నటిస్తుందా? లేకపోతే కాస్త గ్యాప్ ఇచ్చి సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ తో మరింత రెచ్చిపోతుందా? అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X