దిశా పటానికి బంపర్ ఆఫర్.. హాలీవుడ్‌లో టాప్ హీరోతో రొమాన్స్!

మామూలుగా పాశ్చాత్య సినిమా నటీనటులు ఒక ఇండస్ట్రీ నుంచి ఇంకో ఇండస్ట్రీలో కనిపించడం అనేది ఎప్పుడూ మంచి ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఇలా ఇండియన్ సినిమా నుంచి హాలీవుడ్ లో నటించిన ఇండియన్ స్టార్స్ కొంతమంది కనిపించడం మనల్ని ఒకింత మంచి ఎగ్జైట్ గా అనిపిస్తుంది.

ఇలా పలువురు నటీనటులు హాలీవుడ్ లో కనిపించగా వీరిలో దాదాపు హిందీ సినిమా నుంచే కనిపిస్తే సౌత్ నుంచి ధనుష్ అవెంజర్స్ దర్శకులతో వర్క్ చేసాడు. కాగా హిందీ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్, ప్రియాంక చోప్రా, అనీల్ కపూర్ లాంటి స్టార్స్ మెరిసారు. మరి లేటెస్ట్ గా మరో సెన్సేషనల్ హాట్ బ్యూటీ దిశా పటాని ఓ హాలీవుడ్ ఆఫర్ అందుకున్నట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి.

Is disha patani got another hollywood offer here is whats her 1st

కాగా దిశా పటాని సినిమాలో కాదు కాని ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్ లో కనిపిస్తుంది అని తెలుస్తోంది. కాగా ఈమె హాలీవుడ్ భారీ ఏక్షన్ సినిమా సిరీస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫేమ్ నటుడు టైరిస్ డార్నెల్ గిబ్సన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది అని తెలుస్తుంది. అయితే హోలీవుడ్ నటులతో దిశా స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదైతే తొలి సారి కాదు.

ఇది వరకే దిశా హాలీవుడ్ టాప్ స్టార్ తోనే సినిమా చేసింది. కాగా అది ఎవరో కూడా కాదు సెన్సేషనల్ మార్షల్ ఆర్ట్స్ హీరో జాకీ ఛాన్ తో ఆమె నటించింది. తనతో పాటుగా సోను సూద్ కూడా నటించిన ఆ సినిమానే "కుంగ్ ఫు యోగ". ఈ సినిమా 2014లో వచ్చింది కానీ ఇప్పుడు ఉన్నంత ఫేమ్ అలాంటివి మార్కెట్ లు ఈ సినిమాకి దక్కలేదు.

Is disha patani got another hollywood offer here is whats her 1st

పైగా కంటెంట్ కూడా సరిగ్గా లేకపోవడంతో తెలుగులో డబ్బింగ్ అయినప్పటికీ డిజాస్టర్ అయ్యింది. సో ఇలా ఎప్పుడో దిశా నుంచి ఓ బిగ్ స్టార్ తో సినిమా ఉంది. ఇక మళ్లీ దాదాపు దశాబ్దం తర్వాత ఇండియన్ సినిమా ఇండస్ట్రీ దాటి కనిపించనుంది అని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఇవి పక్కన పెడితే ఆల్రెడీ దిశా పటాని రీసెంట్ గానే సౌత్ లో సూర్య హీరోగా నటించిన భారీ చిత్రం కంగువ లో నటించగా దీనికి ముందు పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ "కల్కి 2898 AD" లో కూడా నటించింది. ఇక ఈ సినిమాల తర్వాత మళ్ళీ బాలీవుడ్ లోనే ఆమె బిజీగా ఉండగా సౌత్ లో బహుశా కల్కి సీక్వెల్ లో కనిపించవచ్చు. మరి మళ్లీ రెండోసారి ఇంటర్నేషనల్ ఇండస్ట్రీలో కనిపిస్తుందో లేదో అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X