Political Entry భర్తకు విడాకులిచ్చి రాజకీయాల్లోకి.. తల్లి బాటలో యంగ్ హీరోయిన్

ప్రముఖ నటీనటులు హేమామాలిని, ధర్మేంద్ర కూతురు బాలీవుడ్ హీరోయిన్ ఇషా డియోల్ మీడియాలో తాజాగా హెడ్‌లైన్లను ఆకర్షించింది. భర్తతో పరిష్కరించుకొలేనతంగా విభేదాలు రావడంతో 11 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలికారు. దాంతో ఇషా డియోల్ మరోసారి వార్తల్లో ప్రముఖ వ్యక్తిగా మారారు. అయితే భర్తతో విడాకుల తర్వాత సినీ రంగంలోకి వస్తారని అనుకొంటే.. ఆమె తన అభిమానులకు షాకిచ్చి సంచలన నిర్ణయం తీసుకొన్నది. ఈ వివరాల్లోకి వెళితే..

గతవారం భర్త భరత్ తఖ్తానీతో విడాకులు తీసుకొన్న తర్వాత ప్రస్తుతం తల్లి హేమామాలిని మార్గదర్శకత్వంలో ప్రయాణిస్తున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆమె తిరిగి ఇండస్ట్రీకి వస్తారని అనుకొన్నారు. కానీ ఆమె ప్రస్తుతం రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు రంగాన్ని సిద్దం చేసుకొంటున్నది.

Is Esha Deol Planning to Entry into Indian Politics in Direction of Hema Malini?

ఇటీవల నటి హేమామాలిని మీడియాతో మాట్లాడుతూ.. ఇషా డియోల్ కావాలనుకొంటే త్వరలో రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. ఆమెకు తన తండ్రి ధర్మేంద్ర సంపూర్ణ మద్దతు ఉంది. తన కూతురు పాలిటిక్స్‌లోకి ప్రవేశించాలని ఆయన కోరుకొంటున్నారు. సమయం చూసుకుని రాజకీయాల్లోకి వస్తారు అని అన్నారు.

భర్తతో విడాకుల తర్వాత ఇషా డియోల నా కుటుంబంతోనే ఉంది. తన పిల్లలతో కలిసి ఆమె నా ఫ్యామిలీ వ్యవహారాలు చూసుకొంటున్నది. దాంతో రాజకీయాల్లో నా సేవలు కొనసాగించడానికి చాలా వీలు, సమయం దక్కుతున్నది. కొన్ని రోజులుగా కూతురు విషయంలో ఆందోళనగా ఉన్న ధర్మేంద్ర ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నారు. మథుర పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీకి సేవలకు తోడ్పాటును అందిస్తున్నారు అని హేమామాలిని తెలిపింది.

Is Esha Deol Planning to Entry into Indian Politics in Direction of Hema Malini?

రాజకీయాల్లోకి ఈషా డియోల్, అహానా డియోల్ ఎవరు వచ్చిన నా నుంచి, నా కార్యకర్తల నుంచి ఘన స్వాగతం ఉంటుంది. వారు ఎప్పుడు రావాలనుకొంటే అప్పుడు వారు ప్రవేశించవచ్చు. వారికి వారి పిల్లల భవిష్యత్తు, బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. అన్ని బ్యాలెన్స్ చేసుకొని రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందనేది నా సలహా అని హేమామాలిని అన్నారు.

ఇషా డియోల్ విషయానికి వస్తే.. ప్రముఖ నటి, పార్లమెంట్ సభ్యురాలు హేమామాలిని కుమార్తేగా అందరికి సుపరిచితులు. కోయి మేరే దిల్ సే పూచే, నా తుమ్ జానో నా హమ్, క్యా దిల్ నే కహా, ధూమ్, యువ లాంటి సినిమాల్లో నటించింది. ఇటీవల కేక్ వాక్, ఏక్ దువా అనే సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపునకు నోచుకోలేదు. తాజాగా మరోసారి సినీ, రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X