యంగ్ కొరియోగ్రాఫర్‌తో ఫరియా అబ్దుల్లా అఫైర్.. హిందూ అబ్బాయితో డేటింగ్ అంటూ..

తెలుగు సినిమా రంగంలో కేవలం గ్లామర్ పరంగానే కాకుండా యాక్టింగ్, మ్యూజిక్, ఇతర అంశాలతో ఆకట్టుకొంటున్న తారల్లో ఫరియా అబ్దుల్లా ఒకరు. అందంతోనే కాకుండా అభినయంతో కూడా రాణిస్తూ తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకొంటున్నారు. కేవలం నటనకు పరిమితం కాకుండా తనలోని ప్రతిభను ఇతర అంశాలపై పెడుతూ మల్టీ టాలెంటెడ్ అనే పేరు సంపాదించుకొంటున్నారు. తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ గుర్తింపు ఉండాలని ప్రయత్నిస్తున్న అందాల తార ఫరియా అబ్దుల్లా తన ప్రేమ వ్యవహారాన్ని మీడియాతో పంచుకొన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అఫైర్, డేటింగ్ వ్యవహారాలను చాలా ఓపెన్ మైండ్‌తో వెల్లడించారు. ఆమె లవ్ అఫైర్ గురించి, ఆమె పర్సనల్, ప్రొఫెషనల్ విషయాల గురించిన వివరాల్లోకి వెళితే..

ఫరియా అబ్దుల్లా విషయానికి వస్తే.. పక్కా హైదరాబాదీ అమ్మాయి. ఇక్కడే పుట్టి.. ఈ ప్రాంతంలోనే విద్యాబుద్దులు నేర్చుకొన్నారు. ముస్లిం మతానికి చెందిన ఆమె తన ఇష్టాలకు అనుగుణంగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2021 సంవత్సరంలో జాతి రత్నాలు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత తన ప్రతిభకు అద్దం పట్టే చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకొంటున్నారు.

Faria Abdulla dating Young Choreographer

ఫరియా అబ్దుల్లా తన కెరీర్‌లో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, బంగర్రాజు, రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు, కల్కి, మత్తు వదలరా 2, గుర్రం పాపిరెడ్డి, అనగనగా ఒకరోజు చిత్రాల్లో నటించారు. నటిగానే కాకుండా మత్తు వదలరా 2, గుర్రం పాపిరెడ్డి సినిమాల్లో ర్యాప్ పాటలతో ప్రేక్షకులకు హుషారెత్తించారు. అయితే ఇటీవల ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన లైఫ్‌కు సంబంధించిన విషయాలను పంచుకొన్నారు.

ప్రస్తుతం నేను లవ్‌లో ఉన్నాను. అఫైర్‌ కారణంగా నా పర్సనల్ లైఫ్‌ను, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్‌గా ఉంచుకోగలగుతున్నాను. ప్రస్తుతం నా లైఫ్‌కు అదే ప్రయారిటీ. అయితే నేను ముస్లిం అబ్బాయితో కాకుండా హిందూ అబ్బాయితో ప్రేమలో ఉన్నాను. అతడు నాకు బాల్య స్నేహితుడు కాదు. ఇండస్ట్రీకి చెందిన వారే. నేను ప్రేమిస్తున్న వ్యక్తి కొరియోగ్రాఫర్. మేమిద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం అని ఫరియా అబ్దుల్లా అన్నారు.

నేను ఇటీవల కాలంలో మ్యూజిక్, డ్యాన్స్, ర్యాప్‌లో రాణిస్తున్నానంటే.. అందుకు కారణం ఆయనే. ఆయన అందించే ప్రోత్సాహం వల్లే నేను మ్యూజిక్, డ్యాన్స్ పరంగా రాణిస్తున్నాను. ఓ టీమ్‌లా వర్క్ చేస్తున్నాం. మా మధ్య బంధాన్ని కేవలం లవ్ అఫైర్‌గా నేను చూడను. ఇద్దరి మధ్య జీవితానికి సంబంధించి ఉండే భాగస్వామ్యం. ఇండస్ట్రీలో ఉంటున్నాం కాబట్టి.. వివిధ అంశాలపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి విషయాలను మేము పంచుకొంటాం అని ఫరియా అబ్దుల్లా చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X