twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Hansika Motwani కాబోయే భర్త మొదటి పెళ్లికి హన్సిక హాజరు.. రెండో పెళ్లిలో ట్విస్టు ఏమిటంటే?

    |

    దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వాని పెళ్లి వార్తలు మీడియాలో కొనసాగుతుంటే.. తన ఎంగేజ్‌మెంట్ వార్తను మీడియా లీక్ చేసి అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అయితే కాబోయే భర్తకు ఇది రెండో పెళ్లి కావడంతో అభిమానులకు మరో షాక్ తగిలింది. అయితే కాబోయే భర్త సోహెల్ ఖటురియా మొదటి పెళ్లికి హన్సిక హాజరయ్యారనే వార్త ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ వార్త వివరాల్లోకి వెళితే..

    బాలనటిగా ఇండస్ట్రీలోకి

    బాలనటిగా ఇండస్ట్రీలోకి

    హన్సిక మోత్వానీ వ్యక్తిగత జీవితం విషయంలోకి వెళితే.. బాలనటిగా బాలీవుడ్‌లో భారీ చిత్రాల్లో నటించింది. కోయి మిల్ గయా, మహా, రోమియో జూలియట్ సినిమాల్లో బాలనటిగా నటించింది. ఆ తర్వాత తెలుగులోకి ప్రవేశించి అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో నటించింది. ఆ తర్వాత తమిళంలోకి ప్రవేశించి.. స్టార్ హీరోయిన్‌గా మారింది.

    శింబుతో పీకల్లోతు అఫైర్

    శింబుతో పీకల్లోతు అఫైర్

    తమిళంలో స్టార్ హీరోయిన్‌గా నటిస్తుండగానే.. పలువురి హీరోలతో అఫైర్ వార్తలు వచ్చాయి. అయితే శింబుతో ప్రేమ పీకల్లోతుగా మారి.. పెళ్లి వరకు వెళ్లింది. శింబుతో పెళ్లి ఖాయమని అనుకొనే సమయంలో వారిద్దరు తమ బంధానికి బ్రేకప్ చెప్పారు. అప్పటి నుంచి హన్సిక సింగిల్ స్టేటస్‌గానే మెయింటెన్ చేసింది.

    కాబోయే భర్త ఇదేనంటూ..

    కాబోయే భర్త ఇదేనంటూ..

    అయితే ఇటీవల పారిస్‌లో ఈఫిల్ టవర్‌ ముందు నా కాబోయే భర్తతో ఎంగేజ్‌మెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి వైరల్ చేసింది. తన కాబోయే భర్త పేరు సోహెల్ ఖటురియా అంటూ బయటపెట్టింది. ఎంగేజ్ మెంట్‌కు సంబంధించిన ఫోటోలను తన అభిమానులకు షేర్ చేసింది.

    రింకీ బజాజ్‌కు హన్సిక కామన్ ఫ్రెండ్

    రింకీ బజాజ్‌కు హన్సిక కామన్ ఫ్రెండ్

    సోహెల్ ఖటురియా వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆయనకు 2016లో రింకీ బజాజ్‌ను వివాహం చేసుకొన్నాడు. రింకీ బజాజ్‌కు హన్సిక కామన్ ఫ్రెండ్ కావడంతో వారి మధ్య మంచి కుటుంబ సంబంధాలు ఉన్నాయి. అయితే తన స్నేహితురాలితో సోహెల్ పెళ్లికి హన్సిక హాజరైంది. సోహెల్ తొలి పెళ్లికి సంబంధించిన పెళ్లి వీడియోలో డ్యాన్సులు చేస్తూ హాన్సిక కనిపించింది.

    విడాకుల తర్వాత హన్సిక రెండోపెళ్లికి

    విడాకుల తర్వాత హన్సిక రెండోపెళ్లికి

    అయితే సోహెల్ ఖటురియా, రింకి బజాజ్‌ దాంపత్య జీవితం వైఫల్యం కావడం, ఆ పరిస్థితుల్లో హన్సికతో ప్రేమకు లైన్ క్లియర్ అయిందని బాలీవుడ్ మీడియా రిపోర్ట్. రింకీ బజాజ్‌తో విడాకుల తర్వాత హన్సిక, సోహెల్ ఇద్దరు కొంత కాలం డేటింగ్ చేశారు. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. వారిద్దరి పెళ్లి డిసెంబర్ 2022 అవుతుందని తాజా సమాచారం.

    English summary
    Actresss Hansika Motwani engagement with Sohael Khaturiya news goes viral in media. Here is the report that, Hansika attends Sohael Khaturiya's first marriage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X