వరుణ్ సందేశ్ ఫెల్యూర్ యాక్టర్.. 17 ఏళ్లుగా జరిగిందిదే.. బయటపెట్టిన భార్య వితికా!

వరుణ్ సందేశ్.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి యువతను ఆకట్టుకున్న హీరో. 18 ఏళ్ల కింద మొదలైన ఆయన సినీ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతోంది. కెరీర్ ప్రారంభంలో ఒక ఊపూపిన ఈ క్రేజీ హీరో ఇప్పుడు ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా తర్వాత సినిమా చేస్తూనే వస్తున్నాడు.. కానీ ఆశించిన మేర ఫలితానివ్వడం లేదు. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నం తాను చేస్తూనే వస్తున్నారు.

అయితే.. వరుణ్ సందేశ్ ను కొందరు ఫెల్యూర్ యాక్టర్ అంటూ విమర్శలు కురిపించే వారున్నారు. వారికి చెంపపెట్టుగా భార్య వితికా షేరు సమాధానం ఇచ్చింది. ఓ ఈవెంట్ లో తన భర్త సినిమాల గురించి ఆసక్తికరంగా మాట్లాడింది వితికా షేరు. ప్రతిరోజూ ఇంటికి వచ్చాక వరుణ్ సందేశ్ తనను కొందరు ఫెల్యూర్డ్ యాక్టర్ అంటున్నారని చెప్పుకునే వాడని తెలిపింది. ఫెల్యూర్ లోనూ ఎలా నెట్టుకొస్తున్నావంటూ అడుగుతున్నారని బాధపడేవాడని చెప్పింది.

Is Happy Days Hero Varun Sandesh Failure Actor His Wife Vithika Sheru clarity on this Rumour

ఆ హేళన చేసే ప్రశ్నలకు ఓ వేదికపై వితికా షేరు సమాధానం ఇచ్చింది. వరుణ్ సందేశ్ ఏమాత్రమూ ఫెల్యూర్ యాక్టర్ కాదని స్పష్టం చేసింది. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి హిట్ సినిమాలు అందుకున్నారని చెప్పింది. ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చింది. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా మంచి కంటెంట్ తో సినిమాలు చేసేందుకు తానెప్పుడూ ముందే ఉంటున్నారని చెప్పింది.

ఫెల్యూర్ యాక్టర్ అంటే సినిమాలు చేసి రిజల్ట్ విషయంలో ఫెలవ్వడం కాదని.. మొత్తానికే తమ వల్ల కాదని సినిమాలు వదిలేసి వెళ్లిపోవడం ఫెల్యూర్ యాక్టర్ అని నిర్వచించింది. వరుణ్ సందేశ్ సినిమానే జీవితంగా, వృత్తి మలుచుకున్నాడు కాబట్టి ఎప్పటికీ ఫెల్యూర్ యాక్టర్ కాదని చెప్పుకొచ్చింది. గతంలో మాట్లాడిన ఆమె మాటలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. వరుణ్ సందేశ్ సినిమాల గురించి ఆమె ఎమోషనల్ గా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఇక వరుణ్ సందేశ్ తన కెరీర్ ను 18 ఏళ్ల కింద ప్రారంభించాడు. తొలుత 'హ్యాపీ డేస్' చిత్రంతో టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారిపోయాడు. 2007లో వచ్చిన ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రం యూత్ కు ఎంతగానో నచ్చింది. ఇప్పటికీ ఈ ఫిల్మ్ ను ఆదరిస్తూనే ఉన్నారు ఆడియెన్స్. ఆ తర్వాత 2008లో 'కొత్త బంగారు లోకం' కూడా వరుణ్ సందేశ్ కు మంచి గుర్తింపునిచ్చింది. అలాగే 'కుర్రాడు', 'ఎమైంది ఈ వేళ' వంటి సినిమాలు కాస్తా ఆకట్టుకున్నాయి. కానీ ఆ తర్వాత నుంచి వచ్చిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. అయినా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. వరుణ్ సందేశ్ .. 2022 లో 'ఇందువదన'తో కంటెంట్ పరంగానూ మార్పులు చేస్తున్నారు. రీసెంట్ గా 'నింద', 'విరాజీ', 'రాచరికం' వంటి చిత్రాలతో అలరించాడు.ప్రస్తుతం 'యద్భవం తత్భవతి', 'చిత్రం చూడరా' ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X