లిప్ లాక్ చేయమంటే.. ఏకంగా అలా చేసిందేమిటి? హీరో, డైరెక్టర్ ఫ్యూజులు అవుట్!
సిల్వర్ స్క్రీన్ పై క్వీన్ గా మెరిసిపోవాలంటే హీరోయిన్లు అందాలను ఆరబోయడం తప్పనిసరి. కొన్నిసార్లు హద్దు దాటి ముద్దు సీన్లు కూడా చేయాల్సి ఉంటుంది. విషయం అంతా తెలుసుకున్నాకే ఇండస్ట్రిలోకి అడుగు పెడతారు అందరూ. అయితే ఓ హీరోయిన్ మాత్రం సినిమా స్క్రిప్ట్ చదివాక ముద్దు సన్నివేశాలు ఉన్నాయని తెలిసి కన్నీళ్లు పెట్టుకుందట. అయితే అలాంటి సన్నివేశాలు ఆమెకు ఇబ్బంది కలిగిస్తాయని తెలిసి దర్శకుడు వాటిని తొలగించాడట. మరి ఆ హీరోయిన్ ఎవరో ఓ లుక్కేద్దాం పదండి.
ఒకప్పుడు భారతీయ టీవీ షోలు, సీరియల్స్ చాలా సంప్రదాయంగా ఉండేవి. సంప్రదాయ విలువలను పాటిస్తూ, ఎలాంటి ఎక్స్‌పోజింగ్, రొమాంటిక్ సన్నివేశాలు లేకుండా సీరియల్‌స్ రూపొందేవి. కానీ క్రమంగా కాలంతో పాటు ఈ సరిహద్దులు కూడా చెరిపోయాయి. గత దశాబ్దంలో బుల్లి తెరపై కూడా బోల్డ్ కంటెంట్‌ను ప్రసారం చేయడం స్టార్ట్ చేశారు. ఇక సినిమాల గురించి చెప్పక్కర్లేదు.

అయితే ఇప్పటికీ కొంతమంది సెలబ్రిటీలు ముద్దులు, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి ఇష్టపడడం లేదు. తమకున్న పాపులారిటీ, లేదా స్పెషల్ స్కిల్స్ ను బట్టి సాయి పల్లవి, నిత్యా మీనన్ లాంటి అతికొద్ది మంది మాత్రమే ఈ సన్నివేశాలకు దూరంగా ఉంటారు. దీంతో వాళ్ళలాగే ఉండే కొందరు అనేక అవకాశాలను కోల్పోతున్నారు. అందులో ఒక నటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె పేరు శృతి శర్మ.
నవీన్ పోలిశెట్టి "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ"లో శృతి శర్మ కథానాయికగా నటించింది. 2018 నుంచి హిందీ సీరియల్స్‌లో నటించి పాపులర్ అయిన శృతి పాపులర్ షో "గట్బంధన్"తో టెలివిజన్ అరంగేట్రం చేసింది. ఇందులో ఓ ఐపీఎస్ అధికారి పాత్ర పోషించారు. "ఇండియాస్ నెక్స్ట్ సూపర్ స్టార్స్"లో మూడవ స్థానంలో నిలిచిన తర్వాత ఆమెకు ఏజెంట్ సినిమాలో ఆ పాత్ర లభించింది.
"ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" సినిమాతో 2019లో తెలుగు సినిమాల్లోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఆ తర్వాత 'పాగ్‌లైట్'తో బాలీవుడ్ కి వెళ్ళింది. అయితే తాను రొమాంటిక్ సన్నివేశాల్లో నటించనని శృతి చెప్పింది. ఇటీవల ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతి శర్మ తెరపై రొమాంటిక్, ముద్దు సన్నివేశాలు చేయడం ఇష్టం లేదని వెల్లడించింది.
నేను ఎప్పుడూ తెరపై బోల్డ్‌గా నటించను. నాకు రొమాంటిక్ సీన్స్, కిస్సింగ్ అంటే ఇష్టం ఉండదు. అందుకే చాలా ప్రాజెక్ట్స్ వదిలేశాను అన్నారు. అయితే ఈ నిర్ణయం పట్ల బాధగా లేదని, అవకాశాలు చేజారిపోతున్నాయన్న ఆందోళన లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో శృతి శర్మ సంజయ్ లీలా బన్సాలీ మొదటి వెబ్ సిరీస్ 'హిరామండి'లో ఒక చిన్న పాత్రతో ఓటీటీ అరంగేట్రం చేసింది.
తాజాగా ఇంటర్వ్యూలో శృతి మాట్లాడుతూ హీరామండి స్క్రిప్ట్ చదివి, ముద్దు సన్నివేశాలు ఉన్నాయని తెలిసి కన్నీళ్లు పెట్టుకున్నాను అని తెలిపింది. అయితే అలాంటి సన్నివేశాలు తనకు ఇబ్బంది కలిగిస్తాయని తెలిసి బన్సాలీ దానిని తొలగించారట. ఈ నేపథ్యంలోనే శృతి టెలివిజన్ పరిశ్రమలో తిరిగి రావాలని భావిస్తున్నట్టు వెల్లడించింది. అక్కడైతే ఇలాంటి సీన్లు లేకుండా తనకు కంఫర్ట్ గా ఉంటుందని, ఇప్పటికే మంచి ఆఫర్లు వచ్చాయని చెప్పింది.


Click it and Unblock the Notifications











