శ్రుతి హాసన్ చేదు అనుభవం.. ఆ మూవీ నుంచి తప్పుకుందా? తప్పించారా?
Shruti Haasan : డిఫరెంట్ కాన్సెప్ట్, సబ్జెక్ట్స్‌తో సినిమాలు చేస్తూ.. యూత్‌లో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్. చాలా తక్కువ బడ్జెట్ తో.. వేగంగా సినిమాలు తీస్తూ.. అంతే స్థాయిలో సక్సెస్ అందుకునే మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేషు. ప్రస్తుతం అడివి శేష్ 'డెకాయిట్' సినిమాల్లో బిజీబిజీగా ఉన్నాయి. అయితే.. పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేయడానికి ఫ్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో డెకాయిట్ మూవీ నుంచి ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఇంతకీ ఆ విషయమేంటో? ఓ లూక్కేయండి.
వాస్తవానికి 'మేజర్' మూవీ సక్సెస్ తర్వాత అడివి శేషు ఆ స్పీడ్ చాలా తగ్గించారు. 2022లో 'మేజర్', 'HIT 2 అనే రెండు సినిమాలతో వచ్చిన అడివి శేష్. గతేడాది ఒక్క మూవీ కూడా విడుదల చేయలేదు. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్నారు. ఈ గ్యాప్ ను పుల్ ఫిల్ చేయడానికి వచ్చే ఏడాది మూడు సినిమాలను విడుదల చేయబోతున్నారట. ప్రస్తుతం అడివి శేష్ 'గూఢచారి 2'(Goodachari 2), 'డెకాయిట్' సినిమాల్లో బిజీబిజీగా ఉన్నారు. గూఢచారి మూవీ భారీ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా. 'గూఢచారి 2'రూపొందిస్తున్నారు. ఈ మూవీ భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేయడానికి ఫ్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. శ్రుతి హాసన్ (Shruti Haasan), అడవి శేషు హీరోహీరోయిన్స్ గా తెరకెక్కుతున్న మూవీ 'డెకాయిట్'. అయితే 'Decoit: A love Story' అనే మూవీ నుంచి ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 'క్షణం','గూఢచారి'సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించిన షానీల్ డియో.. 'డెకాయిట్' మూవీతో డైరెక్టర్ మారారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా కంప్లీట్ అయింది.
అయితే.. ఈ మూవీ నుంచి హీరోయిన్ శ్రుతి హాసన్ తప్పుకుందంటూ ఓ వార్తలు వస్తున్నాయి. డేట్స్ ఇష్యూ కారణంగా శ్రుతి హాసన్ ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ముందుగా అనుకున్న సమయానికి షూటింగ్ జరగకపోవడంతో తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రుతి హాసన్.. రజనీకాంత్ నటిస్తున్న కూలీ మూవీలో కూడా లీడ్ రోల్ చేస్తుంది. అలాగే 'చెన్నై స్టోరీస్' అనే మూవీలో కూడా శృతిహాసన్ లీడ్ రోల్ లో నడుస్తుంది.

వరుసగా మూవీ చేయడంతో డేట్స్ సెట్ కాకపోవడంతో ఆమె మూవీ నుండి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఆమెను కావాలని తీసివేశారా? లేదా ఆమెనే కావాలని తప్పుకున్నారా? అనే సందేహాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే డెకాయిట్ మూవీ షూటింగ్ సగం పూర్తి అయ్యింది. ఇలాంటి పరిస్థితిలో శ్రుతి హాసన్ ఈ మూవీ నుంచి తప్పుకుంటే.. మూవీ బడ్జెట్ అమాంతం పెరిగిపోతుంది. అదీకాకుండా ఆమె ప్లేస్‌లో మరోకరిని పెట్టడం కూడా కష్టమే. దీంతో అడివి శేష్ సినిమాకు సినిమా కష్టాలు వచ్చేలా ఉన్నాయి. అయితే ఈ ఈ రూమర్స్ పై క్లారిటీ రావాలంటే మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించాల్సిందే.


Click it and Unblock the Notifications











