తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో హీరోయిన్.. డిప్రెషన్‌తో ఆత్మహత్యాయత్నం?

సినీ పరిశ్రమలో హీరో అయినా, హీరోయిన్ అయినా అవకాశాలు మెండుగా ఉన్నంత కాలమే వారి మనుగడ ఉంటుంది. ఒక్కసారి ఇమేజ్ మసకబారి, ఆఫర్ల తగ్గాయంటే వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. కారణాలు ఏవైనా కొవొచ్చు.. స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీని శాసించిన సావిత్రి జీవితం ఎలా ముగిసిందో ఆలోచిస్తేనే భయంకరంగా ఉంటుంది. అలాంటి పరిస్థితినే ప్రస్తుతం ఓ యువ హీరోయిన్ ఎదుర్కొంటున్నారనే వార్త మీడియాలో కలకలం రేపింది. ఆ వార్త వివరాల్లోకి వెళితే..

కెరీర్ ఆరంభంలో స్టార్ హీరోలతో : కోల్‌కత్తాకు చెందిన కోయినా మిత్రా టాలెంట్ పుష్కలంగా ఉన్న హీరోయిన్లలో ఒకరు. ప్రముఖ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందిన కోయినా మిత్రాకు బాలీవుడ్‌లో మంచి అవకాశాలే లభించాయి. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమెకు అగ్ర హీరోల చిత్రాల్లో మంచి ఆఫర్లు వచ్చాయి. ధూల్, రోడ్ చిత్రాల్లో స్పెషల్ అప్పీయిరెన్స్‌తో బాలీవుడ్ కెరీర్ ప్రారంభించింది.

 Heroine Koena Mitra attempted suicide

వరుస ఆఫర్లతో టాప్ హీరోయిన్‌గా :
కోయినా మిత్ర కెరీర్ ముసాఫిర్ అనే చిత్రంతో ఘనంగా ప్రారంభమైంది. ఆ తర్వాత ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా, అప్నా సప్నా మనీ మనీ, అనామిక్, హే బేబీ లాంటి చిత్రాల్లో నటించింది. ముసాఫిర్ చిత్రంలో ఓ సాకి సాకీ పాటలో ఆమె వేసిన స్టెప్పులు యువతను ఉర్రూతలూగించింది. ముక్కుసూటిగా వ్యవహరించడం వల్ల హిందీలో ఆఫర్లు భారీగా తగ్గిపోయాయి.

బిగ్‌బాస్‌లో వివాదాస్పదంగా : హిందీలో అవకాశాలు చేజారడంతో వివాదాస్పద బిగ్‌బాస్ సీజన్ 3లోకి వెళ్లింది. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే ఈ షోలో అత్యంత వివాదాస్పదంగా కమెంట్లు చేసింది. సిద్దార్థ్ శుక్లా, షెహనాజ్ గిల్‌తో భారీగా గొడవలు పడింది. షెహనాజ్ గిల్‌ను ఉద్దేశించి.. ఇలాంటి వాళ్ల బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసి షోలోకి తీసుకోవాలి అంటూ ఘాటైన కామెంట్లు చేసింది.

సహచర కంటెస్టెంట్‌పై ఘాటైన విమర్శలు : బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత.. షెహనాజ్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేసింది. బిగ్‌బాస్‌ ఇంట్లో అబ్బాయిల దుప్పట్లో దూరడం తప్ప.. మరో టాలెంట్ లేదని ఘాటైన విమర్శలు చేశారు. అంతేకాకుండా చదువు సంధ్యలు లేని వ్యక్తి అంటూ కామెంట్ చేసింది. కాస్త చదువుకొనే వాళ్లను చూసి షోలోకి తీసుకోవాలి అంటూ కోయినా మిత్రా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

 Heroine Koena Mitra attempted suicide

బాలీవుడ్‌లో కరువైన ఆఫర్లతో :
బిగ్ స్క్రీన్‌పై అవకాశాలు సన్నగిల్లడంతో కోయినా మిత్రా టెలివిజన్ రంగంవైపు దృష్టిపెట్టింది. రియాలిటీ షోలు ఫియర్ ఫ్యాక్టర్ ఇండియాలో పాల్గొన్నది. ఆ తర్వాత ఝలక్ దిక్లా జా సీజన్ 3 లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఇటీవల కాలంలో వెండితెర, బుల్లితెరపై అవకాశాలు సన్నగిల్లాయి. దాంతో డిప్రెషన్‌లోకి వెళ్లిందనే వార్తలు వచ్చాయి.

డిప్రెషన్‌ను తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ : గత కొద్దికాలంగా అవకాశాలు లేకపోవడంతో ఇంటికే పరిమితమైన కోయినా మిత్రా డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న నేపథ్యంలో ఇంటికి అద్దె కట్టని పరిస్థితి ఉంది. దాంతో తన సమస్యల నుంచి శాశ్వతంగా దూరమయ్యేందుకు నిద్రమాత్రలు మింగిది. అయితే తాను ఆత్మాహత్యాయత్నానికి ప్రయత్నించడంతో సన్నిహితులు అప్రమత్తయ్యారు. దాంతో పెద్ద ప్రమాదమే తప్పింది అని క్రిటిక్ ఉమేర్ సంధూ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X