నిధి అగర్వాల్ ఏమైనా జరిగి ఉంటే? మాల్ నిర్వాహకులపై పోలీసులు సీరియస్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ది రాజా సాబ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు పాపులర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఇషాన్ సక్సేనా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రభాస్‌తో సంజయ్ దత్, బోమన్ ఇరానీ, మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ పలని సినిమాటోగ్రాఫర్‌గా, ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రం 2026 సంవత్సరం జనవరి 9వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అవుతున్నది.

Nidhhi Agerwal mobbed

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రంలోని పాటను డిసెంబర్ 17వ తేదీన హైదరాబాద్‌లోని లూలూ మాల్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్‌ను అభిమానులు పెద్ద ఎత్తున్న చుట్టుముట్టి ఆమెపై ఫిజికల్‌గా దాడి చేసినంత పని చేశారు. ఈ సంఘటనపై, అలాగే ఈవెంట్ వద్ద చేపట్టిన సెక్యూరిటీ చర్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న నిరసన, ఆందోళన వ్యక్తమవుతున్నది.

ది రాజా సాబ్ సాంగ్ ఆవిష్కరణ ఈవెంట్ ముగిసిన తర్వాత నిధి అగర్వాల్ తిరిగి వెళ్లిపోయేందుకు బయటకు వచ్చారు. సరైన భద్రతా ఏర్పాట్లు, సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో అభిమానులు, ప్రేక్షకులు ఊహించని విధంగా తోసుకొని వచ్చి ఆమెపై అనుచితంగా ప్రవర్తించారు. ఆ సమయంలో కొందరు బాడీ గార్డులు వచ్చి రక్షణగా నిలువడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఆమెకు జరగకూడదని సంఘటన జరగకుండా ఆగిపోయింది. ఒక్కసారిగా మూకుమ్మడిగా మీదకు రావడంతో నిధి ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

నిధి అగర్వాల్‌కు జరిగిన సంఘటనపై సోషల్ మీడియాలో ఆమె అభిమానులు ఘాటుగా స్పందించారు. లూలూ మాల్‌లో సరైన జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సంఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు సీరియస్ అయ్యారు. మాల్ ఆర్గనైజర్స్‌పై సుమోటోగా కేసు నమోదు చేశారు. సరైన సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోలేదనే విషయంపై పోలీసులు తీవ్రంగా స్పందించారు అనే విషయం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారా? లేదా? అనేది అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X