ప్రియుడికి ఇలియానా గుడ్‌బై.. సహజీవనానికి తెగతెంపులు.. నా జీవితం నా ఇష్టం అంటూ

Recommended Video

Ileana D’Cruz & Boyfriend Andrew Kneebone Are No More Together? || Filmibeat Telugu

అందాల తార ఇలియానా డ్రి క్రజ్ సహజీవనం మరోసారి మీడియాలో చర్చనీయాంశమైంది. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ అండ్రూ నీబోన్‌తో గత కొద్దికాలంగా అఫైర్‌లో ఉంటూ సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారిద్దరి రిలేషన్‌‌షిప్‌కు తెరపడిందా అనే అనుమానాలు బలంగా మీడియాలో వినిపిస్తున్నాయి. అందుకు ఇలియానా చేసిన పనే అందుకు ఆస్కారం కలిగించింది. ఇక వివరాల్లోకి వెళితే..

 నా జీవితం నా ఇష్టం అంటూ

నా జీవితం నా ఇష్టం అంటూ

గత కొదికాలంగా తన రిలేషన్‌షిప్ గురించి మీడియాలో వస్తున్న వార్తలపై ఇలియానా స్పందిస్తూ.. అండ్రూ నీబోన్‌తో నా రిలేషన్ వ్యక్తిగతం. ప్రొఫెషనల్‌గా నా కెరీర్ బాగుంది. వ్యక్తిగత జీవితం కూడా మంచిగా ఉంది. రెండు రకాలుగా నా జీవితం బాగుంది. ఇక మీరు అడిగే ప్రశ్నలపై నేను కామెంట్ చేయాల్సిన అవసరం లేదు అని అండ్రూ రిలేషన్‌పై ఇలియానా పేర్కొన్నారు.

నా అఫైర్ నా వ్యక్తిగతం

నా అఫైర్ నా వ్యక్తిగతం

నా వ్యక్తిగత జీవితం పూర్తిగా నా పర్సనల్. మీడియాకు నా పర్సనల్ లైఫ్ గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇంకా చాలా చూడాల్సిన ప్రపంచం చాలా ఉంది. వ్యక్తిగత జీవితం గురించి బయటకు చెప్పుకోవాలా లేదా అనే నాకు సంబంధించిన అంశం. దానిని బలవంతంగా బయటకు లాగానే చూడకూడదు అని ఇలియానా అన్నారు.

 ప్రియుడితో అప్పుడు అలా

ప్రియుడితో అప్పుడు అలా

అలా అండ్రూతో ఇలియానా హాట్‌హాట్‌గా నడుస్తున్నది. తాజాగా జూలైలో అండ్రూ 31వ జన్మదినోత్సవం రోజున ఇలియానా ఆయనపై తన హృదయ స్పందనను వ్యక్తం చేసింది. అద్భుతమైన వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి మధురమైన రోజున నీతో ఉండాలని అనుకొన్నాను. కానీ ఇలా పరిస్థితులు వేరు చేశాయి అని ఇలియానా కామెంట్ చేశారు.

 నా భర్త అంటూ కామెంట్

నా భర్త అంటూ కామెంట్

అండ్రూతో ఇలియానా మరోస్థాయికి చేరాయనే విషయం సోషల్ మీడియాలో పలు సందర్బాల్లో వ్యక్తమైంది. ఓ దశలో నా భర్త అంటూ ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టడంతో వారి రిలేషన్‌కు అధికారికంగా ఆమోద ముద్ర పడింది. కానీ తాజాగా వారిద్దరూ సోషల్ మీడియాలో అన్‌ఫ్రెండ్ చేసుకొన్నారు. అంతేకాకుండా గతంలో అండ్రూతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసింది.

ఎయిర్‌పోర్టులో గుడ్‌బై సీన్

ఎయిర్‌పోర్టులో గుడ్‌బై సీన్

ఇక ఇలియానా, అండ్రూ రిలేషన్ షిప్‌‌కు బ్రేకప్ పడిందనే విషయంపై చర్చ జరుగుతుండగానే ఎయిర్‌పోర్టులో వారిద్దరూ విడిపోతున్నట్టు పేర్కొన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వారిద్దరు భావోద్వేగంతో కౌగిలించుకొని గుడ్‌ బై చెప్పుకొన్నారనే వార్త మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది. అయితే వారిద్దరి బ్రేకప్‌ జరిగిందా? అందుకు కారణాలేమిటనే విషయం కొద్ది రోజులు ఆగితే అదే తెలుస్తుంది.

ఆకట్టుకోలేకపోతున్న ఇలియానా

ఆకట్టుకోలేకపోతున్న ఇలియానా

తెలుగులో ఇలియానా నటించిన చివరి చిత్రం అమర్ అక్బర్ ఆంథోని. అయితే రవితేజతో కలిసి నటించిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఇక బాలీవుడ్‌లో ఆమె నటించిన రైడ్ చిత్రం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆమె నటించిన పాగల్‌పంతి చిత్రం నవంబర్ 22న రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X