రెండో బిడ్డకు జన్మనిచ్చిన మహేష్ బాబు హీరోయిన్.. సీక్రెట్‌గా గుడ్ న్యూస్ చెప్పిన భామ

తెలుగుతోపాటు భారతీయ ప్రధాన భాషల్లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఇలియానా డీ క్రజ్ మరోసారి బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే తన భర్త మైఖేల్ డోలన్ ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండో బిడ్డకు జననం గురించి ఆమె అత్యంత గోప్యంగా ఉంచారు. తాజాగా తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో ఓ చిన్నారి పసిపాపను ఫోటోను షేర్ చేసి తన రెండో సంతానం గురించి హింట్ ఇచ్చారు. అయితే ఆ బిడ్డ ఆడనా? లేదా మగనా? అనే విషయంపై సస్పెన్స్ కొనసాగించింది. ఇలియానా రెండో బిడ్డ జననం గురించిన వివరాల్లోకి వెళితే..

ఇలియానా విషయానికి వస్తే.. పోకిరి సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. సినిమా ఇండస్ట్రీలో పలువురు హీరోలతో అఫైర్ వార్తలు వినిపించినా గానీ.. అవి ఎక్కువ కాలం నిలువలేదు. కానీ ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీ‌బోన్‌తో సుదీర్ఘ కాలంగా అఫైర్ కొనసాగించింది. అయితే వారిద్దరూ పెళ్లి చేసుకొంటారని అంతా భావించారు కానీ.. ఇద్దరు 2019 లో అభిప్రాయ బేధాల కారణంగా బ్రేకప్ చెప్పుకొన్నారు. ఆ తర్వాత మళ్లీ ఆమె గురించిన అఫైర్లు మీడియాలో కనిపించాయి.

leana D Cruz blessed with Second Bab

అయితే ఆ తర్వాత పోర్చుగీస్‌కు చెందిన మైఖేల్ డోలన్ అనే వ్యాపారవేత్తను 2023 సంవత్సరంలో వివాహం చేసుకొన్నారు. ప్రస్తుతం ఆమె పోర్చుగీస్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. డోలన్‌తో పెళ్లి తర్వాత వారిద్దరికి ఆగస్టు 2023 సంవత్సరంలో కొడుకు పుట్టాడు. అయితే ఇటీవల కాలంలో ఆమె రెండోసారి గర్భం దాల్చిందనే వార్తలు వినిపించాయి. కానీ ఆమె ధృవీకరించలేకపోయింది. దాంతో ఆ ప్రెగ్రెన్సీపై అనేక రకాలుగా కథనాలు వినిపించాయి. కానీ చివరకు రెండో సంతానం గురించిన వార్తను నర్మగర్భంగా చెప్పిందని ఆమె ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

అయితే తన ప్రెగ్నెన్సీ కారణంగా పలు సినిమాలను వదులుకొన్నారు. అందులో అజయ్ దేవగన్‌తో కలిసి నటించాల్సిన రైడ్ 2 సినిమా ఒకటి. ఈ సినిమాలో ఆమెకు భారీ ఆఫర్ ఇచ్చారు. కానీ ప్రెగ్నెన్సీ కారణంగా ఆ మూవీని వదులుకొన్నారు అనే వార్త మీడియాలో బలంగా వినిపించింది. ఆ తర్వాత డేట్స్ ఇవ్వలేని కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకొన్నారనే విషయాన్ని సినిమా యూనిట్ పరోక్షంగా వెల్లడించారు.

అయితే ఫాదర్స్ డే ఆదివారం రోజున ఇలియానా రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకొన్నారు. ఓ చిన్నారిని డోలన్ ముద్దాడుతున్న ఫోటోను ఆమె షేర్ చేసింది. అయితే తమకు పుట్టిన బిడ్డ ఆడ పిల్లనా? మగ పిల్లాడా? అనే విషయాన్ని గుప్తంగా ఉంచారు. అయితే ఈ నేపథ్యంలో ఇలియానాకు తన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇలియానా కెరీర్ విషయానికి వస్తే.. దేవదాస్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. ఆ సినిమా హిట్ కావడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత తమిళం, హిందీ భాషల్లో బిజీగా మారిపోయింది. తాజాగా ఆమె ది బిగ్‌బుల్ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం తేరా క్యా హోగా లవ్లీ, దో ఔర్ దో ప్యార్ అనే చిత్రాల్లో నటిస్తున్నది.

More from Filmibeat

Read more about: bollywood pokiri ileana dcruz
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X