మరోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బ్యూటీ పోస్ట్ వైరల్..
గోవా బ్యూటీ , హీరోయిన్ ఇలియానా ( Ileana ).. ఒకప్పుడు తన అందం, అభినయంతో టాలీవుడ్ ను శాసించింది. దేవదాసు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమ్మడు అతి కొద్ది రోజులకే టాప్ హీరోయిన్‌గా మారింది. ఆ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగింది ఈ అమ్మడు. ఇలియానా తన నడుమందాలతో యువతకు నిద్ర లేకుండా చేసింది. ప్రస్తుతం సినిమాకు దూరంగా ఈ అమ్మడు తాజాగా వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్టు నెట్టింట్లో తెగ వైరలవుతోంది.
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మహేష్ బాబు- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన పోకిరీ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారింది. యంగ్ హీరోలతోనే కాదు.. స్టార్ హీరోలతో నటించింది. తన అందచందాలతో తెలుగు ఇండస్ట్రీని కొన్నాళ్ళు ఓ ఊపు ఊపింది. కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ సినిమాల్లో కూడా నటించి అదరగొట్టింది. అందులో 'బర్ఫీ,పటా పోస్టర్ నిఖలా హీరో, మెయిన్ తెరా హీరో, రుస్తుం లాంటీ సినిమాలు మంచి గుర్తింపు తీసుకవచ్చాయి. అయితే కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడే.. సినిమాలకు దూరమైంది.

ఇదెలా ఉండే.. గతేడాది అమెరికా నటుడు మైఖేల్ డోలన్‌ను పెళ్లాడిన ఇలియానా .. న్యూ ఇయర్ ప్రత్యేక సందర్భంగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో తన అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే..ఆ ముద్దుగుమ్మ గత సంవత్సరం 2024 మోమోరీస్ ను గుర్తు చేసుకుంటూ.. ఓ వీడియో బైట్ ను షేర్ చేసింది. ఇందులో ఇలియానా,ఆమె భర్త మైఖేల్, కొడుకు కోవా ఫీనిక్స్ డోలన్ లను చూడవచ్చు. అలాగే.. ఆ బ్యూటీ చేతిలో ప్రెగ్నెన్సీ కిట్‌ను పట్టుకుని కనిపించింది. ఆ ఫిక్ లో ప్రకారం అక్టోబర్ 2024లో తన ప్రగ్నెన్సీని చెక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే.. ఆమె ముఖంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
దీని బట్టి ఇలియాన్ రెండోసారి తల్లి కాబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ విషయంపై ఇలియానా ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. వీడియో క్యాప్షన్‌లో ఇలియానా ఇలా రాసింది- ప్రేమ, శాంతి, ప్రార్థనలు. ఇవన్నీ 2025 సంవత్సరంలో జరుగుతాయని, మునుపటి కంటే మరింత సంతోషం జీవితంలోకి రాబోతుందని నేను ఆశిస్తున్నాను.' అంటూ ఇలియానా తన మనసులోని మాటను ఇలా బయటపెట్టింది.

ఇలియానా నిజంగా గర్భవతి అయితే.. ఆమె 2 సంవత్సరాలలోపు మరొక బిడ్డకు జన్మనిస్తుంది. ఆగష్టు 2023లో ఆమె కొడుకు కోకాకు జన్మనిచ్చిందని విషయం తెలిసిందే. ఇలియనా తన నటనా జీవితంలో తెలుగు, హిందీ సినిమాల్లో నటించి. ఎంతో మంది అభిమానుల హృదయాల్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఇలియానా పోస్టు వైరల్ కావడంతో అభిమానులు ఈమెకు మరోసారి శుభాకాంక్షలు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











