twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిధి అగర్వాల్ ఎంగేజ్‌మెంట్! ఎవరితో.. ఫ్యాన్స్‌కు ఇస్మార్ట్ బ్యూటీ షాక్

    |

    ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ను సొంతం చేసుకొన్న అందాల భామ నిధి అగర్వాల్ ఇక అన్ని భాషల్లో జోరు పెంచేసింది. సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకొన్న నిధి.. ఇస్మార్ట్‌తో టాలీవుడ్‌లో ప్లేస్‌ను పక్కా చేసేసుకొంది. అయితే గతంలో ఓ క్రికెటర్‌తో డేటింగ్ చేస్తుందని వచ్చిన వార్తలు తెలిసిందే. అయితే తాజాగా తన ఇన్స్‌టాగ్రామ్‌లో స్టాటస్ చూసి ఫ్యాన్స్ కంగారు పడిపోయాడు. ఇంతకు ఆ స్టాటస్ ఏంటనీ అభిమాని నిలదీశాడు. ఇంతకు తన ఇన్స్‌టా స్టాటస్‌లో ఏముందంటే..

    కేఎల్ రాహుల్‌తో

    కేఎల్ రాహుల్‌తో

    హిందీలో మున్నా మైఖేల్‌తో సినీ రంగ ప్రవేశం తర్వాత క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో ప్రేమాయణం అంటూ జోరుగా నడిపించినట్టు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా వారిద్దరూ స్థిరమైన బంధాన్ని ఏర్పరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే వార్తల మధ్య బ్రేకప్ పడింది. అప్పటి నుంచి సింగిల్‌గానే ఉంటున్నారు.

    ఎంగేజ్డ్ స్టాటస్‌తో కన్‌ఫ్యూజన్

    ఎంగేజ్డ్ స్టాటస్‌తో కన్‌ఫ్యూజన్

    కానీ తాజాగా ఇన్స్‌టాగ్రామ్‌లో ఎంగేజ్డ్ అనే స్టాటస్‌ను పెట్టి నిధి అగర్వాల్ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ స్టాటస్ చూసిన నెటిజన్లకు చాలా సందేహాలు వ్యక్తమయ్యాయి. నిధి పెళ్లి చేసుకోబోతుందా? ఇది ఎలా జరిగింది? అంటూ ప్రశ్నలు కుప్పలుగా వచ్చాయి. ఈ క్రమంలో ఓ అభిమాని తన సందేహాన్ని ఆపుకోలేక ఇంతకీ ఏం జరిగింది. వెంటనే సమాధానం ఇవ్వు అంటూ ప్రశ్నించాడు.

    కంగారు పడిన ఫ్యాన్స్

    కంగారు పడిన ఫ్యాన్స్

    అభిమానుల అసహనాన్ని చూడలేక నిధి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. అభిమానులు మీరు కంగారు పడొద్దు అంటూ పోస్టు పెట్టింది. అబ్బాయిలు నేను ఎవరినీ ఎంగేజ్ చేసుకోలేదు అంటూ ఓ కామెంట్ పెట్టింది. దాంతో ఫ్యాన్స్ చల్లబడిపోయారు. ఆ విధంగా నిధి కంగారు పెట్టింది. అయితే ఇంకా ఎంగేజ్డ్ స్టాటస్‌పై అలానే సందిగ్దత తొలిచివేస్తున్నది.

    ఇస్మార్ట్ తర్వాత తెలుగులో, హిందీలో

    ఇస్మార్ట్ తర్వాత తెలుగులో, హిందీలో

    ఇక ఇస్మార్ట్ శంకర్ తర్వాత తెలుగులో సాయిధరమ్ తేజ్‌తో జతకడుతున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రతీరోజు పండగే సినిమా తర్వాత సాయిధరమ్ తేజ్ నటించే చిత్రంలో నిధికి ఆఫర్ దొరికిందనే వార్త మీడియాలో స్వైరవిహారం చేస్తున్నది. అలాగే హిందీలో రెండు సినిమాలు కమిట్ అయ్యారు. ఇక్కా, మాస్క్ చిత్రాల్లో నిధి నటిస్తున్నారు.

    English summary
    Is Nidhhi Agerwal engaged? This question sent social media into viral. Nidhhi fans rises many questions on her Engaged status in Instagram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X