Janhvi Kapoor యంగ్ హీరో పక్కన శ్రీదేవి కూతురు.. టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా వెండితెర అరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటోంది. ఈ క్రమంలో జాన్విని దక్షిణాదికి కూడా తీసుకురావాలని దర్శకనిర్మాతలు ప్రయత్నించారు. అయితే ఇప్పటివరకు ఆ విషయంలో ఒక్క ముందడుగు కూడా పడలేదు. అయితే ఇకపై జాన్వి దక్షిణాదిపై కూడా ఫోకస్ పెట్టబోతోందట. ఆ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ వివరాల్లోకి వెళితే..

అక్కినేని హీరోతో టాలీవుడ్ ఎంట్రీ?
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించబోయే ఓ సినిమాలో జాన్వీ హీరోయిన్‌గా నటించబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో `ఏజెంట్` సినిమా చేస్తున్న అఖిల్.. ఆ తర్వాత ఓ పాన్ ఇండియా మూవీకి రెడీ అవుతున్నాడట. బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ ఈ సినిమాను రూపొందించనున్నాడట. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వి నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉందట. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్టు సమాచారం.

వరుస సినిమాలతో బిజీ బిజీ
`ధడక్` సినిమాతో జాన్వీ హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. తొలి సినిమాతోనే అటు అందంపరంగానూ, ఇటు నటనపరంగానూ అభిమానులను జాన్వి ఆకట్టుకుంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వి పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. 2020లో `గుంజన్ సక్సేనా` సినిమా చేసింది. జాన్వి ప్రస్తుతం `రూహీ`, `తక్త్`, `గుడ్ లక్ జెర్రీ`, `హెలెన్` మొదలైన సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు తన తండ్రి నిర్మిస్తున్న సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా హాజరవుతోంది. మరోవైపు పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ కెరీర్లో బిజిబిజీగా ఉంది.

అంగాంగ ప్రదర్శనలో మేటి
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వి తరచుగా తన హాట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంటుంది. ఆమె ఫోటోస్, వీడియోస్ ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. జాన్వికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. విహార యాత్రలకు వెళ్లినపుడు అక్కడ బికినీలో దిగిన ఫొటోలను, పలు మ్యాగజైన్ కవర్ పేజీల కోసం చేసిన ఫొటోషూట్లను జాన్వి తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ఇక, జాన్వి జిమ్ లుక్ కూడా ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతుంటుంది.

ముంబైలో ఖరీదైన ఇల్లు
2018లో తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ ఇప్పటివరకు చేసిన సినిమాలు రెండు మాత్రమే. ప్రస్తుతం పలు సినిమాలు లైన్లో ఉన్నాయి. మరోపక్క వాణిజ్య ప్రకటనలతో జాన్వి చాలా బిజీగా ఉంది. సోషల్ మీడియాలో కూడా జాన్వి బ్రాండ్ ప్రమోషన్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో జాన్వీ సంపాదన బాగానే ఉందని టాక్. జాన్వి ఇటీవల ముంబైలోని జుహు ప్రాంతంలో 39 కోట్ల రూపాయల విలువ చేసే ఓ ఖరీదైన ఇంటిని సొంతం చేసుకుందట. ఈ ఇంటికి సంబంధించి 78 లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీని జాన్వీ కపూర్ చెల్లించిందట.
Recommended Video


ఆలియా రూట్లోనే నడుస్తోందా?
బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ అయిన ఆలియా భట్ దక్షిణాది సినిమాల్లో కూడా నటించేందుకు ఆసక్తి చూపుతోంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న తెలుగు సినిమాల్లో నటించాలనుకుంటోంది. ఆలియా రూట్లోనే జాన్వి కూడా నడుస్తోందట. ఒక్క బాలీవుడ్ మాత్రమే కాకుండా దక్షిణాదిపై కూడా ఫోకస్ పెట్టాలని ఫిక్స్ అయిందట. తెలుగు, తమిళ చిత్ర సీమల నుంచి అవకాశాలు వస్తే పరిశీలించాలని భావిస్తోందట. ఈ నేపథ్యంలోనే అఖిల్ సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











