Janhvi Kapoor: జాన్వీకి తెలుగులో మరో బంపరాఫర్.. టాప్ హీరోతో రొమాన్స్?

ఇటీవల తెలుగు సినిమాలో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన పలువురు హీరోయిన్స్ లో బాలీవుడ్ సెన్సేషనల్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా ఒకరని చెప్పవచ్చు. మాములుగా మన తెలుగు సినిమాలో చాలా మంది హీరోయిన్స్ కి మరీ పాజిటివ్ పరిస్థితులు కనిపించవు. కాగా కొందరికి మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నా, అలాగే ఇంకొందరు మంచి హిట్స్ కొట్టినా కూడా వారికి వరుస ఆఫర్స్ రావడం అనేది గగనమే అని చెప్పాలి.

కాగా ఇంకొందరు మాత్రమే ఫస్ట్ సినిమా ఎలా ఉన్నా కూడా వరుస్స ఆఫర్స్ వరిస్తాయి. ఇలాంటి బ్యూటీస్ లో లేటెస్ట్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి కూడా కనిపిస్తుంది. అలాగే తనతో పాటుగా ఒక్క సినిమాతోనే టాలీవుడ్ ని ఊపేసిన బ్యూటీ మాత్రం జాన్వీ కపూర్ అని చెప్పాలి. అలనాటి నటి శ్రీదేవి వారసురాలిగా హిందీలో సినిమాలు కొన్ని చేసినప్పటికీ అక్కడ దొరకని బ్రేక్ మన తెలుగు సినిమాలో దక్కింది.

is janhvi kapoor got another big offer in telugu

ఇక్కడ నుంచే ఒకదాని తర్వాత ఒకటి అది కూడా టాప్ స్టార్స్ తో సినిమాలు ఆమె దక్కించుకుంది. కాగా మొదట మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేస్తే నెక్స్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో రొమాన్స్ చేస్తుంది. కాగా ఇపుడు ఈ ఇద్దరితో పాటుగా మరో బిగ్ టాప్ స్టార్ సరసన రొమాన్స్ చేసేందుకు సిద్ధం అయ్యినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా ఈసారి జాన్వీ పేరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించనుంది అని సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కాగా ఇపుడు అల్లు అర్జున్ నెక్స్ట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో భారీ ఫాంటసీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో కాదు మరో సినిమాలో ఆమె ఫిక్స్ అయ్యిందట. అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ కలయికలో సినిమా అని ఎప్పుడు నుంచో క్రేజీ రూమర్స్ ఉన్నాయి.

is janhvi kapoor got another big offer in telugu

కాగా ఈ సినిమా కోసమే జాన్వీ కపూర్ పేరు లాక్ అయ్యినట్టుగా ఇపుడు ఊహాగానాలు మొదలయ్యాయి. మరి ఇదే కానీ నిజం అయితే తెలుగులో వచ్చినా కొద్ది సమయంలోనే ఆల్మోస్ట్ టాప్ స్టార్స్ ని కవర్ చేసేసిన బ్యూటీగా జాన్వీ కపూర్ నిలుస్తుంది అని చెప్పవచ్చు. మరి ఈ రూమర్స్ లో ఎంతవరకు నిజం ఉంది అనేది ఇంకొన్నాళ్ళు ఆగి చూడాల్సిందే.

పుష్ప 2 హిట్ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అలాగే దర్శకుడు అట్లీ కూడా హిందీలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో జవాన్ అనే సినిమా చేసి 1000 కోట్లకి పైగా వసూళ్లు అందించాడు. సో ఇలాంటి సెన్సేషనల్ కలయిక అందులోని జాన్వీ కపూర్ లాంటి అందాల భామ తోడైతే ఈ కాంబినేషన్ ఇంకో లెవెల్ కి వెళుతుంది అని చెప్పవచ్చు. సో ఈ బిగ్గెస్ట్ కాంబినేషన్ పై ఒక్క అధికారిక క్లారిటీ మాత్రం ఇంకా రావాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: janhvi kapoor ram charan rc16
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X