కీర్తి సురేష్ ను నిరాశ పరచిన తెలుగు హీరో.. !
ప్రెజెంట్ సౌత్ ఇండియా సినిమా నుంచి ఉన్నటువంటి టాప్ మోస్ట్ యంగ్ హీరోయిన్స్ లో కీర్తి సురేష్ కూడా తప్పకుండ ఉంటుంది. మిడ్ రేంజ్ హీరోస్ నుంచి స్టార్ హీరోస్ తో సినిమాలు చేసే వరకు ఎదిగి ఇప్పుడు ఏకంగా నార్త్ మార్కెట్ లోకి కూడా అడుగు పెట్టింది. కాగా ఇప్పుడు కీర్తి ఇలా అనేక సినిమాల్తో బిజీగా ఉంది.
అయితే అందరి హీరోయిన్స్ కి ఉన్నట్టే కొన్ని డ్రీం ప్రాజెక్ట్ లు డ్రీం రోల్స్ ఇంకా డ్రీం హీరోతో సినిమా చేయాలి లాంటివి కీర్తి సురేష్ కి కూడా ఉన్నాయట. అయితే ఆమెకి ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఎప్పుడు నుంచో ఆశగా ఉందట. అది కూడా ఆ స్టార్ హీరో మన తెలుగు నుంచే ఉండడం విశేషం. ఇంతకీ ఆ తెలుగు స్టార్ హీరో మరెవరో కూడా కాదు మన టాలీవుడ్ పవర్ హౌస్ టాలెంట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అట.

ఈమె ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఇప్పుడు కాదు ఎప్పుడు నుంచో అనుకుంటుందట. అప్పట్లో తన మహానటి సినిమా సమయంలో ఎన్టీఆర్ ప్రత్యేకంగా సినిమా యూనిట్ ని కలిసినపుడు తన పక్కన ఉన్నపుడు కీర్తి తమ ఇద్దరి జోడి ఎంతో బాగుంటుంది అని భావించింది అట. అలాగే ఆన్ స్క్రీన్ పై కూడా ఇద్దరినీ తెరపై చూసినపుడు తమ విజువల్స్ బాగుంటాయని అప్పుడు నుంచే ఎన్టీఆర్ తో నటించే అవకాశం వస్తే నటించాలని ఆమె కోరుకుందట.
కానీ అలాంటి కథ కానీ అప్రోచ్ కానీ ఇంకా తన దగ్గరకి రాలేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే ఎన్టీఆర్ తో నటించడానికి మరో కారణం తన పెర్ఫామెన్స్ కూడా అని తెలిపింది. ఎన్టీఆర్ ఎంతటి పొటెన్షియల్ ఉన్న నటుడో తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో ఇలా కూడా అలాంటి పెర్ఫామర్ తో నటించాలని తప్పకుండ ఉంటుంది అని అందుకే ఎన్టీఆర్ తో ఎప్పటికైనా సినిమా చేయాలని ఆమె ఎపుడు నుంచో కోరుకుంటుందట.

కాగా కీర్తి సురేష్ తెలుగులో ఉన్న టాప్ స్టార్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్స్ తో కూడా సినిమాలు చేసింది. మరి వారితో సమానమైన ఎన్టీఆర్ ఒక్కడితో మాత్రం బ్యాలన్స్ ఉండిపోయింది అని చెప్పాలి. మరి ఈ ఇద్దరు టాలెంటెడ్ జోడీపై ఎవరు సినిమా చేస్తారు ఎప్పుడు కలిసి కనిపిస్తారు అనేవి కాలమే నిర్ణయించాలి.
కాగా ఇప్పుడు ఎన్టీఆర్ పలు భారీ చిత్రాలు దేవర, తన మొదటి బాలీవుడ్ చిత్రం దర్శకుడు అయాన్ ముఖర్జీతో "వార్ 2" ఇంకా దర్శకుడు ప్రశాంత్ నీల్ లతో సెన్సేషనల్ సినిమాలు చేస్తుండగా వీటిలో కొరటాల శివతో చేస్తున్న చిత్రం దేవర ఈ ఏడాది సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి రాబోతుంది.


Click it and Unblock the Notifications











