For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షాకింగ్: కాజల్ అగర్వాల్ ప్రేమలో పడిందా.! అనుమానాలు రేకెత్తిస్తున్న ఫొటో

  By Manoj
  |

  ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ తెలుగు సినీ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది చందమామ కాజల్ అగర్వాల్. టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ.. భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుని రికార్డులకెక్కింది. ఇప్పుడు మాత్రం ఆమె పరిస్థితి పూర్తి భిన్నంగా తయారయింది. అప్పట్లో ఒకేసారి రెండు మూడు సినిమా షూటింగులలో పాల్గొన్న ఈ హాట్ బ్యూటీ.. ప్రస్తుతం ఆఫర్లు లేక సతమతమవుతోంది. అంతేకాదు, కాజల్‌కు హిట్ వచ్చి చాలా సంవత్సరాలే అయింది. తాజాగా ఆమె ప్రేమలో పడిందంటూ ప్రచారం జరుగుతోంది. ఎందుకు ఈ ప్రచారం జరుగుతోంది.? ఇంతకీ ఆమె నిజంగానే ప్రేమలో పడిందా.?

   తొలిసారి అలాంటి పాత్రకు ఓకే చెప్పింది

  తొలిసారి అలాంటి పాత్రకు ఓకే చెప్పింది

  టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఈ ఏడాది రెండు మూడు సినిమాల్లోనే కనిపించింది. దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీలో కలిపి దాదాపు పది సినిమాల్లోనైనా నటించే ఈ అమ్మడు.. ప్రస్తుతం ఒకే ఒక్క సినిమాలో నటిస్తోంది. మంచు విష్ణు నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘మోసగాళ్లు'లో మాత్రమే కాజల్ కనిపించనుంది. అది కూడా ఆమె చెల్లెలి పాత్రను పోషిస్తోంది.

  సెన్సార్ బాధితురాలిగా మిగిలిపోయింది

  సెన్సార్ బాధితురాలిగా మిగిలిపోయింది

  బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్ నటించిన చిత్రం ‘క్వీన్'. ఈ సినిమా దక్షిణాదిలో అన్ని భాషల్లో రీమేక్ చేశారు. మిగిలిన ఇండస్ట్రీల్లో రాని సమస్య కాజల్ నటించిన తమిళ వర్షన్ ‘పారిస్ పారిస్'కు మాత్రమే వచ్చింది. ఇందులో ఈ హాట్ బ్యూటీ బోల్డ్ సీన్స్‌లో కనిపించడంతో పాటు కొన్ని బూతు పదాలను వాడడం వల్లే ఈ సినిమా విడుదలకు సెన్సార్ అడ్డు చెప్పింది.

  మరో గ్లామర్ రోల్‌కు గ్రీన్ సిగ్నల్

  మరో గ్లామర్ రోల్‌కు గ్రీన్ సిగ్నల్

  కాజల్ అగర్వాల్ ఇకపై దూకుడు ప్రదర్శించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆమె వరుసగా సినిమాలు ఒప్పుకోడానికి సిద్ధం అయిందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమె యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘జాన్'లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఆమె గ్లామర్ పాత్రను పోషించనుందనే టాక్ వినిపిస్తోంది.

  అక్కడ అమ్మడు ఫుల్ బిజీ

  ఈ స్టార్ హీరోయిన్ సినిమా షూటింగులు ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ బిజీగా గడుపుతోంది. తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ పంచుకోవడంతో పాటు వ్యక్తిగత జీవితానికి చెందిన విశేషాలను పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. దీంతో కాజల్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది.

  CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
  కాజల్ అగర్వాల్ ప్రేమలో పడిందా.!

  కాజల్ అగర్వాల్ ప్రేమలో పడిందా.!

  టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో బీచ్ దగ్గర తన వేళ్లతో లవ్ గుర్తును చూపిస్తోంది. దీంతో కాజల్ ప్రేమలో పడిందా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ మేరకు ఆమె ఫొటో కింద కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

  English summary
  Has Kajal Aggarwal, who had confessed that she would marry soon recently, has apparently dropped a hint at her wedding? A picture posted by her on Instagram has paved way for the rumours of her marriage.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X