Kajal Aggarwal పాపం కాజల్ అగర్వాల్.. ఆచార్యలో సీన్లు భారీగా కట్.. ఏం జరిగిందంటే?
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన ఆచార్య చిత్రం విజువల్ ట్రీట్‌గా ఉండబోతుందనే విషయాన్ని చిత్ర యూనిట్ స్పష్టం చేస్తున్నది. సిల్వర్ స్క్రీన్ మీద ఈ సినిమా చాలా ఎమోషనల్‌గా ఉంటుందనే విషయాన్ని దర్శకుడు కొరటాల శివ కూడా క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా చిరంజీవి సరసన నటించిన కాజల్ అగర్వాల్ గురించి, ఆమె పాత్ర గురించి ఆసక్తికరమైన విషయం మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఆ విషయం ఏమిటంటే..

చిరంజీవితో రెండోసారి
ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారనే వార్త బయటకు వచ్చినప్పుడు మెగా ఫ్యాన్స్ సంబరపడిపోయారు. చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నంబర్ 150 చిత్రంలో మెగాస్టార్ సరసన నటించడమే కాకుండా ఆటపాటల్లో సరైన జోడుగా మెప్పించింది. దాంతో ఈ కాంబో రిపీట్ అవుతుందని తెలిసి హ్యాపీ అయ్యారు.

ఆచార్య షూట్ సమయంలో ప్రెగ్నెన్సీ
ఇక ఆచార్య సినిమా షూటింగులో పాల్గొనడం, షూట్ చేసిన పాటలు కూడా అభిమానుల్లో అంచనాలు పెంచాయి. అయితే అదే సమయంలో కాజల్ అగర్వాల్ పెగ్నెంట్ కావడంతో ఆమె కొద్దిరోజులు సినిమా షూటింగుకు దూరంగా ఉన్నారు. అయితే అదే సమయంలో కరోనావైరస్ కారణంగా షూటింగులు వాయిదా పడటం ఈ అందాల తారకు కలిసి వచ్చింది. ఆ తర్వాత తన పాత్రను కూడా పూర్తి చేసింది.

ట్రైలర్‌లో కాజల్ కనిపించకపోవడంపై
ఆచార్య సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజై మంచి రెస్సాన్‌ను సొంతం చేసుకొన్నది. కాజల్ కనిపించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. పూజా హెగ్డే కాస్తో కూస్తో ట్రైలర్ కనిపించింది. అయితే కాజల్ కనిపించకపోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే కాజల్ రోల్‌పై రకరకాల కామెంట్లు సోషల్ మీడియాలో కనిపించాయి.

ఆచార్య మూవీ నిడివి తగ్గించే విషయంలో
ఆచార్య సినిమాకు సంబంధించిన తాజా వార్త ఒకటి కాజల్ అగర్వాల్ పాత్రపై క్లారిటీ ఇచ్చేలా చేసింది. ఆచార్య సినిమా ఫైనల్ అవుట్‌పుట్ మూడు గంటలపాటు ఉండటంతో దానిని కుదింపే పనిలో పడ్డారు. చివరకు కాజల్ పాత్రకు సంబంధించిన పలు సీన్లను నిర్ధాక్షిణ్యంగా కట్ చేసినట్టు సమాచారం.

కాజల్ సీన్లు భారీగా కట్
ఆచార్య సినిమాను 3 గంటల నిడివి నుంచి దాదాపు 15 నిమిషాలు కట్ చేసి 2 గంటల 45 నిమిషాలకు కుదించారు. ఈ క్రమంలో కాజల్ అగర్వాల్ ఉండే సీన్లను లేయాల్సి వచ్చింది. దాంతో కాజల్ పాత్ర లెంగ్త్ తక్కువే ఉంటుంది అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకు ఈ సినిమాలో కాజల్ రోల్ ఎంత ఉంటుందనేది కొద్ది రోజులు ఆగితే స్పష్టమవ్వడం ఖాయం.


Click it and Unblock the Notifications











