సీనియర్ హీరోతో కాజల్ అగర్వాల్ రొమాన్స్.. తండ్రి వయసున్న హీరోతోనా అంటూ ట్రోలింగ్

ఏ సినీ పరిశ్రమలో అయినా కూడా హీరోయిన్స్ సైడ్ నుంచి జెనరేషన్స్ మారుతున్న కొద్దీ కొన్ని కంప్లైంట్స్ వస్తుంటాయి. అది ఇప్పుడు నుంచే కాదు ఎప్పుడు నుంచో ఉన్నదే.. తమకంటే ఎంతో పెద్ద వాళ్ళు అయిన హీరోలతో రొమాన్స్ చెయ్యాలి, సాంగ్స్ చెయ్యాలి కానీ వాళ్ళకి వయసైతే మాత్రం హీరోయిన్స్ గా అవకాశాలు రావు. అయితే ఇవి నిర్మాతలు బిజినెస్ దృష్ట్యా టాప్ హీరోస్ విషయంలో తప్పక చేయాల్సిన పరిస్థితి.

అయితే ఈ ఆనవాయితీ ఎప్పుడో వింటేజ్ సినిమాల నుంచి కూడా ఉంది. కానీ ఇప్పటికీ 50 ఏళ్ళు ఉన్న హీరోతో వారికీ సగం వయసు ఉన్న హీరోయిన్స్ జత కట్టడం ఆగడం లేదు. కానీ ఇపుడు ఉన్న సోషల్ మీడియా ప్రపంచంలో మాత్రం ఆ హీరోయిన్స్ కంటే నెటిజన్స్ ఎక్కువగా బాధ పడిపోతున్నారు. మెయిన్ గా మన తెలుగు హీరోస్ లో అయితే ఎందుకో ఈ విషయంలో మాస్ మహారాజ రవితేజ పై బాగా నెగిటివిటీ సోషల్ మీడియాలో ప్రదర్శిస్తుంటారు నెటిజన్స్.

Is Kajal Aggarwal to romance Kamal Haasan in Indian 3

కాగా రవితేజ చిన్న ఏజ్ ఉన్న హీరోయిన్స్ ని తన సినిమాల్లో పెట్టుకుంటాడని ఇదంతా యంగ్ హీరోయిన్ శ్రీలీల తో చేసిన "ధమాకా" నుంచి మొదలైంది అని చెప్పాలి. ఆ సినిమాలో ఇద్దరిపై కొన్ని పోస్టర్స్ మూలాన బాగా ట్రోల్స్ వచ్చాయి. కానీ సీన్ కట్ చేస్తే వీరిద్దరి జంట అసలు వయసుతో సంబంధమే లేకుండా బిగ్ స్క్రీన్స్ పై చించేశారు. మరి ఈ తర్వాత కూడా రవితేజపై ట్రోల్స్ ఆగలేదు.

ఆ మధ్య "ఈగల్", ఇప్పుడు "మిస్టర్ బచ్చన్" కి కూడా ఇదే నెగిటివిటీ స్టార్ట్ అయ్యింది. ఇటీవల వచ్చిన ఓ సాంగ్ లో అయితే హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ తో కొన్ని స్టెప్పులు చూసి నెటిజన్స్ మరింత ట్రోల్ చేశారు. కానీ మిగతా హీరోస్ విషయంలో ఎందుకు వారు మాట్లాడారు అని రవితేజ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇటీవల కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 3 లో కమల్ హాసన్ కాజల్ అగర్వాల్ తో రొమాంటిక్ సీన్స్ ఉన్నట్టుగా ఇండియన్ 3 ట్రైలర్ చూస్తే అందరికీ అర్ధం అయ్యింది.

Is Kajal Aggarwal to romance Kamal Haasan in Indian 3

మరి 69 ఏళ్ళు ఉన్న కమల్ 39 ఏళ్ళు ఉన్న కాజల్ తో రొమాన్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అప్పుడు ఎవరూ ఎందుకు మాట్లాడరు అని రవితేజ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. రవితేజకి తన హీరోయిన్స్ కి ఇప్పుడు ఎలాగైతే 20 ఏళ్ల గ్యాప్ ఉందోఅక్కడ కమల్ కి కాజల్ కి కూడా ఎక్కువ గ్యాప్ నే ఉంది. దాంతో తండ్రి వయసు ఉన్న హీరోతో రొమాన్స్ ఏంటి? అంటున్నారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ లేని హీరోస్ అంటే చులకనేనా అన్నట్టుగా రవితేజ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X