11 డిజాస్టర్లు వెంటాడిన స్టార్ హీరోయిన్‌ను ఎవరో తెలుసా? ఈసారైనా హిట్టు కొట్టేనా?

సినిమా పరిశ్రమలో ఒకట్రెండు ఫ్లాపులు పడితే ఆ హీరోయిన్ పరిస్థితి దారుణంగా మారిపోతుంది. ఇక వరుస ఫ్లాపులు వెంటాడితే ఆ పరిస్థితి మహాదారుణంగా ఉంటుందనేది కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే పదికి పైగా డిజాస్టర్లతో ఓ హీరోయిన్ ఇంకా స్టార్ హీరోయిన్‌గా నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వరుస పరాజయాలకు అడ్డుకట్ట వేసేందుకు తాజాగా మరో సినిమాతో బాలీవుడ్ క్వీన్ సిద్దమయ్యారు. ఈ క్వీన్ ఈసారి మ్యాజిక్ చేస్తుందా? అనే విషయంలోకి వెళితే..

బాలీవుడ్ క్వీన్ అంటే మీరు అనుకొన్నట్టే కంగనా రనౌత్ గురించే మనం మాట్లాడుకొంటున్నాం. లేడీ సూపర్ స్టార్, ఫైర్ బ్రాండ్ లాంటి ఇమేజ్‌తో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కంగన ఎదిగిన తీరు స్పూర్తిదాయకమే. ఎంతో మంది వేధింపులు తట్టుకొని నిర్మాతగా, దర్శకురాలిగా రాణిస్తున్నారు.

Is Kangana Ranaut gets Success with Emergency after 11 Disasters in Bollywood

కంగన రనౌత్ సినిమా కెరీర్ తీవ్రమైన ఆటుపోట్లకు గురి అవుతున్నది. ఆమె నటించిన తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమా తర్వాత వరసు ఫ్లాపులు వెక్కిరించాయి. అయితే మణికర్ణికతో ఘన విజయం అందుకొన్నప్పటికీ.. ఆ విజయోత్సాహం ఎంతోసేపు నిలువలేదు. ఆ తర్వాత వరసు ఫ్లాపులతో సినీ విమర్శకులు, ప్రముఖుల మాటల దాడికి గురైంది. కంగన కెరీర్ క్లోజ్ అనే మాట బాలీవుడ్‌లో బలంగా వినిపించింది.

అయితే తను వెడ్స్ మను రిటర్న్స్ మూవీ తర్వాత ఐ లవ్ NY, కట్టి బట్టి, రంగూన్, సిమ్రాన్ సినిమాలు భారీగా దెబ్బ తీశాయి. ఆ తర్వాత వచ్చిన మణికర్ణిక 100 కోట్ల క్లబ్‌లో చేరి ఊరట కలిగించింది. ఆ తర్వాత తీసిన జడ్జిమెంటల్ హై క్యా, పంగా, తలైవి, ధాకడ్, టికు వెడ్స్ షేరు, చంద్రముఖి 2, తేజాస్ చిత్రాలు డిజాస్టర్లుగా మారాయి. దాంతో ప్రస్తుతం ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఎమర్జెన్సీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Is Kangana Ranaut gets Success with Emergency after 11 Disasters in Bollywood

సినిమా కెరీర్ ఇబ్బందుల్లో ఉండగానే రాజకీయాలపై దృష్టి సారించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎంపీగా పోటీ ఘన విజయం సాధించారు. ప్రస్తుతం అటు ఎంపీగా, ఇటు యాక్టర్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. పాలిటిక్స్‌పై పట్టు సాధించిన క్వీన్.. ప్రస్తుతం బాలీవుడ్‌లో హిట్టు కొట్టి తన స్థానాన్ని పదిలం చేసుకొనే పనిలో ఉన్నారు.

ఇదిలా ఉండగా, ఇందిరాగాంధీ బయోపిక్‌గా ఎమర్జెన్సీ సినిమాతో జనవరి 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కథ, దర్శకత్వం, నిర్మాతగా మారడమే కాకుండా ఇందిరా పాత్రలో నటించారు. ఈ సినిమా ద్వారా తన పరాజయాలకు అడ్డుకట్ట వేస్తుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ సినిమా కంగనకు పూర్వ వైభవం తెస్తుందా? లేదా వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X